గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి : సీపీ

| Edited By:

Aug 27, 2019 | 3:50 PM

సెప్టెంబర్ 2న జరగనున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు నగరంలో చురుకుగా సాగుతున్నాయి. వినాయక ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గణేష్‌ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గణేష్‌ మండపాల నిర్వాహకులకు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం ఉదయం జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడామని.. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా ఏడువేలకు పైగా గణేష్‌ మండపాలకు రిజిస్టేషన్‌ […]

గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి : సీపీ
Follow us on

సెప్టెంబర్ 2న జరగనున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు నగరంలో చురుకుగా సాగుతున్నాయి. వినాయక ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గణేష్‌ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గణేష్‌ మండపాల నిర్వాహకులకు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం ఉదయం జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడామని.. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా ఏడువేలకు పైగా గణేష్‌ మండపాలకు రిజిస్టేషన్‌ జరిగిందని తెలిపారు. ప్రతి గణేష్‌ మండప నిర్వాహకులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. గణేష్‌ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 21వేల మంది పోలీసులు, 56 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని ఐదు జోన్లకు 5 ప్రత్యేక రంగుల స్టిక్కర్లు ఇస్తున్నామని అంజనీకుమార్ తెలిపారు.