హైదరాబాద్‌లో హవాలా క్యాష్ రూ.8 కోట్లు పట్టివేత

| Edited By:

Apr 09, 2019 | 9:11 AM

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా తాయిలాలను సిద్ధం చేశారు రాజకీయ నేతలు. ఇప్పటికే ఈసీ చేపట్టిన తనిఖీల్లో వందల కోట్ల రూపాయల నగదు బయటపడుతోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పట్టుబడిన సొత్తు దాదాపు 500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు లెక్కలు గడుతున్నారు. కాగా.. తాజాగా.. హైదరాబాద్ నారాయణ‌గూడలో భారీగా నగదు పట్టుబడింది. పక్కా సమాచారంతో పోలీసులు 8 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల […]

హైదరాబాద్‌లో హవాలా క్యాష్ రూ.8 కోట్లు పట్టివేత
Follow us on

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా తాయిలాలను సిద్ధం చేశారు రాజకీయ నేతలు. ఇప్పటికే ఈసీ చేపట్టిన తనిఖీల్లో వందల కోట్ల రూపాయల నగదు బయటపడుతోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పట్టుబడిన సొత్తు దాదాపు 500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు లెక్కలు గడుతున్నారు.

కాగా.. తాజాగా.. హైదరాబాద్ నారాయణ‌గూడలో భారీగా నగదు పట్టుబడింది. పక్కా సమాచారంతో పోలీసులు 8 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల అధికారులు, ఐటీ అధికారులు కూడా నారాయణ గూడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు సేకరించారు. మొత్తం 8 కోట్ల నగదు, పట్టుబడ్డ వ్యక్తులను పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు.

అయితే.. ఈ మొత్తం డబ్బంతా పార్టీ ఫండ్‌ అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ అన్నారు. బ్యాంకు నుంచి అధికారికంగా డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎన్నికల నియమావళిని తాము ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు పోలీసులే అత్యుత్సాహం చూపించారన్నారు కృష్ణ సాగర్.