Hyderabad: నగరం నిద్రిస్తున్న వేళ… శివార్లలో మేల్కొనే ఓ చీకటి సామ్రాజ్యం!

నగరం నిద్రపోతున్న వేళ.. శివార్లలో మాత్రం 'నిషా' మేల్కొంటుంది. పగలు ప్రశాంతంగా కనిపించే పచ్చని తోటలు.. రాత్రి అవగానే డ్రగ్స్‌కు, నేరాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారిపోతాయ్. కంచె దాటితే చాలు.. అక్కడ చట్టం కూడా చచ్చిపోతుంది! పబ్‌లు, క్లబ్‌ల కాలం చెల్లింది. అక్కడ డ్రగ్స్ పట్టుబడుతున్న సంఘటనలు దాదాపుగా కనుమరుగవుతున్నాయ్. ఇప్పుడా నిషా సామ్రాజ్యాన్ని 'ఫామ్‌హౌస్‌'లే ఏలుతున్నాయ్. మొయినాబాద్ ముజ్రా డాన్సులు.. జన్వాడ రేవ్ పార్టీలు.. అజీజ్‌నగర్ డ్రగ్ డెన్‌లు. ఇలా.. ఒక్కో ఏరియా ఒక్కోటైప్ పార్టీలకు కేరాఫ్‌గా మారిపోయాయ్. పోలీసుల నిఘా లేదు.. అధికారుల నియంత్రణ అసలే లేదు. ఎప్పుడో డ్రగ్స్ దొరికితే తప్ప.. సమాజానికి తెలియని పచ్చి నిజాలెన్నో సమాధి అవుతాయ్ అక్కడ. ఆ ఎత్తైన గోడల వెనుక దాగున్న చీకటి సామ్రాజ్యాలు అన్నీ ఇన్నీ కావు. హవాలా సొమ్ము మార్పిడికి, రియల్ ఎస్టేట్ మాఫియా సెటిల్‌మెంట్లకు, రాజకీయ కుట్రలకు.. ఆ ఏకాంత ప్రదేశాలే అడ్డాలు. మొయినాబాద్ ఘటనతో ఫామ్‌హౌస్‌లలో జరుగుతున్న అరాచకాల గురించి మరోసారి మాట్లాడుకుంటున్నాం గానీ.. బయటకు రానివి, సామాన్యులకు తెలియనివి లెక్కలేనన్ని. అసలు.. యాంటీ-సోషల్ యాక్టివిటీస్‌కు ఫామ్‌హౌస్‌లనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? పోలీసులకు తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుందో. అయినా సరే.. ఎవరికీ ఎందుకని భయం లేకుండాపోయింది? ఫామ్‌హౌస్‌లలో జరిగే అసాంఘిక కార్యక్రమాలు ఎందుకని పెద్దగా తెలియవు?

Hyderabad: నగరం నిద్రిస్తున్న వేళ...  శివార్లలో మేల్కొనే ఓ చీకటి సామ్రాజ్యం!
Farmhouse Secrets

Updated on: Mar 16, 2026 | 9:34 PM

ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కొన్నాళ్లుగా డిస్కషన్ జరుగుతూనే ఉంది. మళ్లీ ఎందుకని దీని గురించే మాట్లాడుకోవాలి? ఎందుకంటే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నన్ని ఫామ్‌హౌస్‌లు మరెక్కడా ఉండవు. అసలు.. ఫామ్‌హౌస్‌లో యాంటీ-సోషల్ యాక్టివిటీస్ అనే కల్చర్ హైదరాబాద్ పరిసరాల్లో తప్ప మరెక్కడా కనిపించదు కూడా. ఆ మాటకొస్తే.. దక్షిణాదిలో ఇలాంటి సంస్కృతి ఉన్నది హైదరాబాద్ సరౌండిగ్స్‌లోనే. కేరళ లాంటి రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. కాని, అక్కడ జరిగేది ఫ్యామిలీ గెట్ టు గెదర్లు, వ్యవసాయం. అంతే తప్ప, డ్రగ్స్ మత్తులో ఊగితూగడం.. అసాంఘిక, అసభ్యకరమైన పనులు జరగడం ఈ నగర పరిధిలోనే జరుగుతుంటాయి. అందుకే, ఇప్పుడీ డిస్కషన్. ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లు ప్రశాంతతకు చిరునామాలు. కానీ ఇప్పుడు అవి చీకటి దందాలకు అడ్డాలు. 1990, 2000 మొదట్లో ఫామ్‌హౌస్‌లు అంటే నిజంగానే వ్యవసాయం చేసే చోటు. మామిడి తోటలు, కూరగాయల పెంపకం కోసం వీటిని వాడేవారు. వీకెండ్ రిలాక్సేషన్ కోసం ఫామ్‌హౌస్‌లకు వెళ్లేవాల్లు. నగరంలోని ధనిక వర్గాలు వారాంతాల్లో కుటుంబంతో కలిసి పచ్చని ప్రకృతిలో గడపడానికి, పిల్లలకు పల్లెటూరి వాతావరణం చూపించడానికి వీటిని నిర్మించుకునేవారు. ఫామ్‌హౌస్‌లంటే ఇప్పట్లోలా గ్రాండియర్‌గా ఏం ఉండేవి కావు. సెక్యూరిటీ గార్డులు వంటి హంగామా కూడా ఉండేది...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి