మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. 22 రోజులకు 20లక్షల బిల్లు

| Edited By:

Aug 15, 2020 | 1:15 PM

ఫీజులపై అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల తీరు మారడం లేదు.

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. 22 రోజులకు 20లక్షల బిల్లు
Follow us on

Hospital charges Rs 20 lakh bill: ఫీజులపై అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల తీరు మారడం లేదు. తాజాగా కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన ఓ వ్యక్తికి రూ.20లక్షల బిల్లు వేశారు. అప్పటికే కొంత డబ్బు చెల్లించిప్పటికీ.. మిగతా మొత్తాన్ని చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అంతేకాదు దాదాపు 40 గంటల పాటు మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలోనే ఉంచుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 12న రాత్రి మృతి చెందాడు. అతడు 22 రోజుల పాటు అక్కడ చికిత్స పొందగా.. 20లక్షల బిల్లు వేశారు. అప్పటికే బీమా ద్వారా రూ.11.5లక్షలు చెల్లించగా.. మిగిలిన ఫీజును కూడా కట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. అంత కడితేనే మృతదేహాన్ని ఇస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యారోగ్య అధికారులకు ఫిర్యాదు చేశారు.

Read More:

‘మదన్ మోహన్ మాలవ్య’గా అల్లు అర్హ.. ఫొటో వైరల్‌

‘స్మార్ట్‌ బస్‌ షెల్టర్’‌.. అధిక ఉష్ణోగ్రత ఉంటే ‘నో’ ఎంట్రీ