ఛీ ఛీ ఇదేం పాడు పని.. హైదరాబాద్‌లో నడి రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. అందరూ చూస్తుండగా ఇలా..

అమ్మాయి.. అబ్బాయి.. ఇద్దరూ బైక్ ఎక్కారు.. ఇంత వరకు బాగానే ఉంది.. కట్ చేస్తే.. అమ్మాయేమో.. అబ్బాయి ఎదురుంగా మంచిగా వాటేసుకుని కూర్చొని ఉంది.. అదేంది అనుకుంటున్నారు.. అవునండి బాబూ.. అమ్మాయి.. అబ్బాయి కలిసి.. నడిరోడ్డుపై హద్దులు దాటారు.. బైక్ ను అబ్బాయి రైడ్ చేస్తుండగా.. అమ్మాయేమో అతన్ని హత్తుకుని కూర్చొని ఉంది..

ఛీ ఛీ ఇదేం పాడు పని.. హైదరాబాద్‌లో నడి రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. అందరూ చూస్తుండగా ఇలా..
Hyderabad Viral Video

Updated on: Jul 14, 2025 | 12:41 PM

అమ్మాయి.. అబ్బాయి.. ఇద్దరూ బైక్ ఎక్కారు.. ఇంత వరకు బాగానే ఉంది.. కట్ చేస్తే.. అమ్మాయేమో.. అబ్బాయి ఎదురుంగా మంచిగా వాటేసుకుని కూర్చొని ఉంది.. అదేంది అనుకుంటున్నారు.. అవునండి బాబూ.. అమ్మాయి.. అబ్బాయి కలిసి.. నడిరోడ్డుపై హద్దులు దాటారు.. బైక్ ను అబ్బాయి రైడ్ చేస్తుండగా.. అమ్మాయేమో అతన్ని హత్తుకుని కూర్చొని ఉంది.. ఇలా ప్రేమికుల జంట ఇలా ఎంజాయ్ చేస్తూ రోడ్డు పై ప్రయాణించడం సంచలనంగా మారింది. ఇదెక్కడో కాదు మన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై ఒక జంట బహిరంగంగా హద్దులు దాటింది.. ఇద్దరూ ప్రేమికులు బైక్ పై వెళుతూ ఒకరినొకరు హత్తకుని ప్రయాణించారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఈ వీడియోలో, వీరిద్దరూ వేగంగా బైక్ పై వెళుతున్నప్పుడు, స్నేహితురాలు ముందు కూర్చుని ఉండగా.. అబ్బాయి బైక్ నడుతున్నాడు.. ఇద్దరూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించారు.

వీడియో చూడండి..

ఈ జంట చేసిన నిర్లక్ష్యపు స్టంట్ వారి ప్రాణాలను.. రోడ్డుపై వెళ్తున్న ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా ఉంది.. దీనిని చూసిన ఇతర బైకర్లు.. నెటిజన్లు.. నడిరోడ్డుపై లవర్స్ చేసిన బాధ్యతారహితమైన చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ యువతి రైడర్ ఒడిలో కూర్చుని.. బహిరంగ ప్రదేశానికి తగనిదిగా భావించే సంజ్ఞలు చేయడం అశ్లీల చర్యల కిందకు వస్తుందని.. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హైదరాబాద్ జంట రోడ్డుపై ఇలా ప్రవర్తించి వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, పహాడీ షరీఫ్ ద్వారా రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక యువ జంట సన్నిహితంగా ప్రవర్తించడం కూడా అప్పట్లో వైరల్ అయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..