నగరంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

| Edited By:

Jun 27, 2020 | 5:53 PM

శనివారం నాడు మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు.. వరుణుడు దయ తలిచాడు. సాయంత్రం ఒక్కసారిగా నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

నగరంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..
Follow us on

శనివారం నాడు మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు.. వరుణుడు దయ తలిచాడు. సాయంత్రం ఒక్కసారిగా నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో నీరు నిలువకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ అధికారులను అప్రమత్తం చేశారు. జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, కోఠి, హిమాయత్‌ నగర్‌, పంజాగుట్ట పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక సికింద్రాబాద్‌, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ ప్రాంతంలో కూడా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీ ఈదురు గాలులు వీస్తుండటంతో.. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో‌ అంతరాయం ఏర్పడింది. దీంతో పలు కాలనీలు అంధకారంలో ఉండిపోయాయి.