కనులపండువగా లక్ష్మీనారాయణస్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు.. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో..

|

Aug 07, 2024 | 9:50 PM

మై హోమ్‌ ప్రధాన కార్యాలయ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది.

కనులపండువగా లక్ష్మీనారాయణస్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు.. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో..
Lakshmi Narayan Temple
Follow us on

హైదరాబాద్‌ హైటెక్‌సిటీ సమీపంలో ఉన్న మైహోమ్‌ నవద్వీపలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 15 ఏళ్ల కిందట హైటెక్‌సిటీ ప్రాంతంలో మైహోమ్‌ నవద్వీప ప్రాంగణంలో శ్రీ మత్స్య, కూర్మ.. శ్రీదేవి-భూదేవి సమేత లక్ష్మీ నారాయణ ఆలయాన్ని జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు నిర్మాణం చేయించారు. ప్రతియేటా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ యేడాది మైహోమ్‌ నవద్వీపలో 15 వార్షిక బ్రహ్మోత్సవాలను శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైహోమ్‌ గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు, కుటుంబ సభ్యులు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మైహోం నవద్వీపలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి భక్తులను ఆశీర్వదిస్తున్నారన్నారు. ఈ 15వ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చినజీయర్‌స్వామి చెప్పారు.

గత 15 ఏళ్ల క్రిందట నిర్మించిన ఈ ఆలయం.. అప్పటినుంచి ఇప్పటివరకు హైటెక్ సిటీ ప్రాంతం చుట్టుపక్కల భక్తులను ఆశీర్వదిస్తూ ఉందని తెలిపారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

వీడియో చూడండి..

మైహోమ్‌ నవద్వీపలో స్వామివారి కల్యాణోత్స కార్యక్రమం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. వందలాదిగా తరలివచ్చిన భక్తులకు మంగళ శాసనాలు చేశారు శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..