లవ్‌లో ఫెయిల్‌ అయిన వారే వీరి టార్గెట్..!

| Edited By:

Apr 08, 2019 | 4:13 PM

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. బిజినెస్‌లో నష్టపోయిన వారితో పాటు.. లవ్‌లో ఫెయిల్ అయిన వారిని డ్రగ్స్ ముఠా టార్గెట్ చేస్తోంది. సిటీలో పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. యువతను కొకైన్, హెరాయిన్‌లకు బానిసలుగా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి డ్రగ్స్ ముఠాలు. డ్రగ్స్ మాఫియా పోలీసులకు చిక్కకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. కొన్ని ప్రత్యేకమైన యాప్స్ ద్వారా ఫేక్ నంబర్స్‌తో కాల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి […]

లవ్‌లో ఫెయిల్‌ అయిన వారే వీరి టార్గెట్..!
Follow us on

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. బిజినెస్‌లో నష్టపోయిన వారితో పాటు.. లవ్‌లో ఫెయిల్ అయిన వారిని డ్రగ్స్ ముఠా టార్గెట్ చేస్తోంది. సిటీలో పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. యువతను కొకైన్, హెరాయిన్‌లకు బానిసలుగా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి డ్రగ్స్ ముఠాలు.

డ్రగ్స్ మాఫియా పోలీసులకు చిక్కకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. కొన్ని ప్రత్యేకమైన యాప్స్ ద్వారా ఫేక్ నంబర్స్‌తో కాల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌, నార్కోటిక్‌ అధికారులు ఎంత ప్రయత్నించినా చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం, నానల్‌నగర్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేయడంతో గుట్టు రట్టయింది.

నైజీరియన్ల వద్ద నుండి లక్షన్నర రూపాయల విలువైన 25 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, గోవాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. సిటీలో డ్రగ్స్ అమ్మకానికి ప్రయత్నించిన ఆర్నాల్డ్ ప్యాట్రిక్, అబ్ధుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.