పుల్వామా అమ‌ర‌వీరుల కుటుంబాలు ఒక్కొక్క‌రికి 25 ల‌క్ష‌లు: సీఎం కేసీఆర్‌

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:52 PM

హైదరాబాద్ : పుల్వామా దాడిలో మృతులైన సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల ఆత్మశాంతి కోసం తెలంగాణ శాసనసభ్యులు నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. సభలో పుల్వామా ఘటనపై సభ్యులు ప్రసంగించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పుల్వామా దాడి కేవలం సైనికుల మీద జరిగిన దాడి కాదని.. అది దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 […]

పుల్వామా అమ‌ర‌వీరుల కుటుంబాలు ఒక్కొక్క‌రికి 25 ల‌క్ష‌లు: సీఎం కేసీఆర్‌
Follow us on

హైదరాబాద్ : పుల్వామా దాడిలో మృతులైన సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల ఆత్మశాంతి కోసం తెలంగాణ శాసనసభ్యులు నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. సభలో పుల్వామా ఘటనపై సభ్యులు ప్రసంగించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పుల్వామా దాడి కేవలం సైనికుల మీద జరిగిన దాడి కాదని.. అది దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయిల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రకటనను అన్ని పక్షాల నేతలు హర్షించారు.