అచ్చు విశాల్ సినిమాలోలా చీటింగ్.. హైదరాబాద్‌లో సీబీఐ దాడులు

| Edited By: Srinu

Jan 03, 2020 | 7:58 PM

విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా గుర్తుందా..? అందులో తప్పుడు ఆధారాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తూ కమిషన్ తీసుకుంటూ ఉంటుంది ఓ ముఠా. అచ్చు అలానే.. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగింది. ఒకటి, రెండు కాదు నకిలీ పత్రాలతో ఎస్‌బీఐ నుంచి ఏకంగా రూ.16కోట్ల రుణాన్ని పొందారు ఆరుగురు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు ఆరు ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. అయితే ఈ చర్యకు పాల్పడింది మరేవరో కాదు.. ఎస్‌బీఐకు చెందిన ఉన్నత ఉద్యోగులు కావడం గమనర్హం. […]

అచ్చు విశాల్ సినిమాలోలా చీటింగ్.. హైదరాబాద్‌లో సీబీఐ దాడులు
Follow us on

విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా గుర్తుందా..? అందులో తప్పుడు ఆధారాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తూ కమిషన్ తీసుకుంటూ ఉంటుంది ఓ ముఠా. అచ్చు అలానే.. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగింది. ఒకటి, రెండు కాదు నకిలీ పత్రాలతో ఎస్‌బీఐ నుంచి ఏకంగా రూ.16కోట్ల రుణాన్ని పొందారు ఆరుగురు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు ఆరు ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. అయితే ఈ చర్యకు పాల్పడింది మరేవరో కాదు.. ఎస్‌బీఐకు చెందిన ఉన్నత ఉద్యోగులు కావడం గమనర్హం. తప్పుడు పత్రాలతో పాటు లేని మనుషులను ఉన్నట్లుగా చూపి వారు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

రీన్‌ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీరందరూ రుణాలను పొందారు. ఆరు నెలల కిందట ఈ స్కాం బయటపడగా.. మొత్తం రూ.16కోట్లు నొక్కేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్‌లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మరి ఈ స్కాంలో ఎంతమంది సూత్రధారులు ఉన్నారు..? దీని వెనుక చక్రం తిప్పిందెవరు..? ఇంతకు ఆ డబ్బు ఏమైంది..? అన్న ప్రశ్నలకు సమాధానాలను త్వరలో తేలయనున్నాయేమో చూడాలి.