హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై కారు దగ్ధం!

| Edited By:

Dec 04, 2019 | 3:57 AM

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని ఓ కారు బూడిదైంది. రోడ్డుపై వెళుతోన్న టీఎస్ 10 ఈఏ 5896 కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును రోడ్డుపక్కగా ఆపేసారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి కిందకు దిగారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంపై పోలీసులు […]

హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై కారు దగ్ధం!
Follow us on

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని ఓ కారు బూడిదైంది. రోడ్డుపై వెళుతోన్న టీఎస్ 10 ఈఏ 5896 కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును రోడ్డుపక్కగా ఆపేసారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి కిందకు దిగారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.