
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) బుల్లెట్ లభించడం తీవ్ర కలకలం రేపింది. అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద తనిఖీల సమయంలో పోలీసులు లైవ్ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు (Security Check) నిర్వహిస్తుండగా, సదరు ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లో బుల్లెట్ ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ (CISF) సిబ్బంది స్కానింగ్‌లో గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ జీఎంఆర్ (GMR) ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.
సదరు ప్రయాణికుడి దగ్గరకు ఆ బుల్లెట్ ఎలా వచ్చింది? దానికి సంబంధించిన సరైన లైసెన్స్ ఏమైనా ఉందా? లేదా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు.
కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది. గతంలో కూడా పలువురు ప్రయాణికుల నుంచి బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..