నాలుగు గంటలపాటు లిఫ్ట్‌లో బాలుడు..!

| Edited By: Srinu

Jun 12, 2019 | 4:47 PM

చందానగర్ పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్‌లో మూడేళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. సుమారు నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు 108 ఉద్యోగులు శ్రమించి బాలుడిని సురక్షితంగా రక్షించడంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీంతో స్థానికులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. స్వగృహ అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్ నంబర్ ఈ ఏ2లో నివాసం ఉండే ఫణీంద్రా చారి కుమారుడు శౌర్యన్ ఆడుకుంటూ లిఫ్ట్‌‌ ఎక్కాడు. పై వరకు వెళ్లిన లిఫ్ట్ సాంకేతిక […]

నాలుగు గంటలపాటు లిఫ్ట్‌లో బాలుడు..!
Follow us on

చందానగర్ పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్‌లో మూడేళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. సుమారు నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు 108 ఉద్యోగులు శ్రమించి బాలుడిని సురక్షితంగా రక్షించడంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీంతో స్థానికులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

కాగా.. స్వగృహ అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్ నంబర్ ఈ ఏ2లో నివాసం ఉండే ఫణీంద్రా చారి కుమారుడు శౌర్యన్ ఆడుకుంటూ లిఫ్ట్‌‌ ఎక్కాడు. పై వరకు వెళ్లిన లిఫ్ట్ సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. లిఫ్ట్ఎంతకీ కిందకు రాకపోవడంతో బాలుడు అరవడం మొదలు పెట్టాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం మివ్వగా.. లిఫ్ట్ గోడలు పగల గొట్టి బాలుడిని రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.