AP CM Jagan: ముచ్చింతల్ రామానుజుడి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌

|

Feb 07, 2022 | 7:35 PM

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు...

AP CM Jagan: ముచ్చింతల్ రామానుజుడి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌
Follow us on

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రామానుజాచార్యుల సహాస్రాబ్ది వేడుకలకు హాజరయ్యారు. దీంతో జగన్‌కు టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మైహోం అధినేత రామేశ్వర్ రావు , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , గువ్వల బాలరాజు పలువురు నేతలు స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌కు శాలువాలతో సత్కరించారు.

జగన్‌ను ప్రశంసించిన చినజీయర్‌ స్వామి:

ముఖ్యమంత్రి జగన్‌ను చినజీయర్‌ స్వామి ప్రశంసించారు. జగన్‌ నిబద్దతను చూసి ఆశ్చర్యపోయానని, ఏపీలో అన్ని వర్గాల ప్రజలు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఇందుకు అభినందిస్తున్నానని అన్నారు. జగన్‌ అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నారని, విద్య, వయసు, ధనం, అధికారం ఇవన్ని ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరని, కానీ జగన్‌లో అలాంటివేమి లేవని అన్నారు. వైఎస్‌ జగన్‌ అందరి సలహాలు స్వీకరిస్తారని, మరింత ఉన్నతమైన స్థానానానికి ఎదగాలని చినజీయర్‌ స్వామి ఆకాంక్షించారు.