Hyderabad: అందంగా ఉన్నావ్.. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు.. ఆ తర్వాత రూమ్‌కి పిలిచి..

|

Aug 01, 2024 | 8:39 AM

నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ అత్యాచర సంఘటనలు రిపీట్‌ అవుతూనే ఉన్నాయి. ఎక్కడో ఓచోటల నిత్యం చిన్నారులు, మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.. తాజాగా.. హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Hyderabad: అందంగా ఉన్నావ్.. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు.. ఆ తర్వాత రూమ్‌కి పిలిచి..
Representative Image
Follow us on

నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ అత్యాచర సంఘటనలు రిపీట్‌ అవుతూనే ఉన్నాయి. ఎక్కడో ఓచోటల నిత్యం చిన్నారులు, మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.. తాజాగా.. హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. బస్సులో ఓ డ్రైవర్ మహిళపై .. రెస్టారెంట్ లో చిన్ననాటి స్నేహితురాలిపై ఇద్దరు వ్యక్తుల లైంగిక దాడి మరువకముందే.. మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.. సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ సాప్ట్ వేర్ యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు.. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న వైజాగ్ కు చెందిన సిద్దార్థ్ వర్మ(30) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.. ఈ క్రమంలో.. హైదరాబాద్ పుప్పలగూడలో నివాసం ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తున్న అనంతపురం ప్రాంతానికి చెందిన యువతిని ట్రాప్ చేశాడు.. తెలిసిన యువతి ద్వారా సాప్ట్ వేర్ యువతిని పరిచయం చేసుకున్న సిద్దార్థ్ వర్మ.. ఆమె నంబర్ తీసుకున్నాడు.. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఆ యువతిని నమ్మించాడు.

ఈ క్రమంలో సిద్దార్థ్ వర్మ యువతిని ఓ రోజు డిన్నర్ పేరిట తాను ఉంటున్న ఇంటికి పిలిచాడు.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఇలా యువతిపై సిద్దార్థ్ వర్మ.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీంతో ఆ యువతి.. సిద్దార్థ్ వర్మ పై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో కేసు నమోదు చేసుకొన్న గచ్చిబౌలి పోలీసులు సిద్దార్థ్ వర్మ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..