Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అయితే జాగ్రత్తగా ఉండండని హెచ్చరిస్తోన్న పోలీసులు..

|

Jan 30, 2021 | 4:43 PM

Airtel Alert There Users About KYC Fraud: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ ఉపయోగిస్తున్నారా.? అయితే జాగ్రత్తగా ఉండండి అంటూ అటు ఎయిర్‌టెల్‌ సంస్థ ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవైసీ అప్‌డేట్‌ అంటూ...

Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అయితే జాగ్రత్తగా ఉండండని హెచ్చరిస్తోన్న పోలీసులు..
Follow us on

Airtel Alert There Users About KYC Fraud: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ ఉపయోగిస్తున్నారా.? అయితే జాగ్రత్తగా ఉండండి అంటూ అటు ఎయిర్‌టెల్‌ సంస్థ ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవైసీ అప్‌డేట్‌ అంటూ వచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేశారో మీ కొంప కొల్లేరవుతుందని సూచిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవలి కాలంలో సైబర్‌ నేరగాళ్లు తమ పంథాను మార్చారు. ముక్కూ మొహం తెలియని నెంబర్ల నుంచి లింక్‌లు వస్తే వినియోగదారులు అప్రమత్తంగా ఉంటున్నారని భావిస్తోన్న నేరగాళ్లు కొత్త దారి వెతికారు. తాజాగా అలాంటి మోసమే వెలుగులోకి వచ్చింది. కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే నిలిచిపోతుందని ఎయిర్‌టెల్‌ యూజర్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. సైబర్‌ నేగరాళ్లు పంపిస్తోన్న ఈ లింక్‌లను ఓపెన్‌ చేసి కొందరు యూజర్లు మోసపోతున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌టెల్‌ తమ యూజర్లను జాగ్రత్తగా ఉండండి అని తెలిపింది. తాజాగా ఇదే విషయాన్ని హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఎయిర్‌టెల్‌ కేవైసీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్లు చేస్తోన్న పనిఏంటంటే.. మొదట ఒక లింక్‌ను యూజర్లకు పంపించి.. దానిపై క్లిక్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని చెప్తారు. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత.. బ్యాంకు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సిందిగా అడుగుతారు. ముందుగా రూ. 10 చెల్లిస్తే మొబైల్ సేవలు కొనసాగుతాయని చెబుతున్నారు. ఒకవేళ లింక్ క్లిక్ చేసి నేరగాళ్లు చెప్పినట్లు చేస్తే ఇక మీ పని అంతే. మీ అకౌంట్లో నగదుతో పాటు విలువైన మీ వ్యక్తిగత వివరాలు సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

హైదరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్..

Also Read: హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చోరి కలకలం.. మైనంపల్లి ఇంటికి కన్నం వేసిన దొంగలు.. రంగంలోకి పోలీసు ఉన్నతాధికారులు..!