Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ట్రెయిన్‌లో సాంకేతిక లోపం.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తుండగా..

|

May 24, 2022 | 2:33 PM

ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న రైలులో మూసారాంబాగ్ స్టేషన్  వద్ద సాంకేతిక లోపంతో కాసేపు నిలిచిపోయింది. రైలు నిలిచిపోవడంతో మైట్రోరైళ్ల రాకపోకల్లో కాసేపు ఆలస్యంగా నడిచాయి. దీంతో..

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ట్రెయిన్‌లో సాంకేతిక లోపం.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తుండగా..
Hyderabad Metro
Follow us on

గ్రేటర్ వాసుల కలల మెట్రోకు (Hyderabad Metro)సాంకేతిక కష్టాలు తొంగిస్తున్నాయి. తాజాగా సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైలు నిలిచిపోయింది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న రైలులో మూసారాంబాగ్ స్టేషన్  వద్ద సాంకేతిక లోపంతో కాసేపు నిలిచిపోయింది. రైలు నిలిచిపోవడంతో మైట్రోరైళ్ల రాకపోకల్లో కాసేపు ఆలస్యంగా నడిచాయి. దీంతో కొన్ని మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు అలానే వేచి ఉన్నారు. ఆ తర్వాత సమస్య క్లియర్ చేయడంతో యధావిధిగా మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఆఫీసులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

సాంకేతిక సమస్య కారణంగా మోట్రో కాసేపు నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే సమస్య వచ్చిన వెంటనే అప్రమత్తమైన సమస్యను పరిష్కరించారు. గత ఏడాది కూడా మెట్రో రైళ్లలో పలుసారు సాంకేతిక సమస్యలు వచ్చాయి. రైళ్లులో సాంకేతిక సమస్యలు రావడంత ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, దూళి కాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే మార్గంలో రెడ్‌లైట్లు వెలుగుతున్నాయి. దీంతో కొన్నిసార్లు మెట్రో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోతున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తున్నారు.