ఔటర్‌పై కారు బోల్తా.. ఐపీఎస్ అధికారికి గాయాలు..

| Edited By:

Jul 16, 2020 | 4:17 AM

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై అదుపుతప్పి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో సీనియర్ ఐపీఎస్ అధికారి, వీవీ శ్రీనివాస్ రావుకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు..

ఔటర్‌పై కారు బోల్తా.. ఐపీఎస్ అధికారికి గాయాలు..
Follow us on

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బుధవారం రాత్రి కారు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రయాణిస్తున్న  కారు బోల్తా పడింది. ఈ ఘటనలో సీనియర్ ఐపీఎస్ అధికారి, వీవీ శ్రీనివాస్ రావుకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఐపీఎస్ అధికారి వీవీ శ్రీనివాస్ రావును గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కారు అదుపుతప్పడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది.