Watch: బస్సును ఢీకొట్టి.. డ్రైవర్‌పైనే దాడి.. మహిళా ప్రయాణికులు అడ్డుకున్నా ఆగని వీరంగం..!

హైదరాబాద్ టోలిచౌకిలో బస్సు డ్రైవర్‌పై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారుతో బస్సును ఢీకొట్టిన జీషాన్ అనే యువకుడు, బస్సు డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళా ప్రయాణికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అతను ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి జీషాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది రోడ్డు భద్రత, ప్రయాణికుల రక్షణపై ఆందోళనలను పెంచుతోంది.

Watch: బస్సును ఢీకొట్టి.. డ్రైవర్‌పైనే దాడి.. మహిళా ప్రయాణికులు అడ్డుకున్నా ఆగని వీరంగం..!
Bus Driver Attacked

Updated on: Oct 06, 2026 | 3:22 PM

హైదరాబాద్: టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో బస్ డ్రైవర్‌పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్ స్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించేందుకు బస్సును ఆపుతున్న సమయంలో వెనుక నుంచి కారులో వచ్చిన జీషాన్.. బస్సును ఢీకొట్టాడు. దీంతో బస్సు డ్రైవర్‌తో జీషాన్‌కు వాగ్వాదం జరిగింది. ఇంతలోనే రెచ్చిపోయిన జీషాన్ అనే యువకుడు డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

బస్సును ఢీకొట్టిన అనంతరం జీషాన్ తన కారును బస్సు ముందుకు తీసుకెళ్లి నిలిపివేశాడు. అనంతరం బస్సు డ్రైవర్‌ను బయటకు రావాలని కోరుతూ.. బస్సును ఎలా నడుపుతున్నావంటూ ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

దాడిని అడ్డుకునేందుకు బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ జీషాన్ వెనక్కి తగ్గకుండా డ్రైవర్‌పై దాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తిగా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బస్సు డ్రైవర్‌పై దాడి చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న టోలిచౌకి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జీషాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బస్సును కారు ఢీకొట్టడం, అనంతరం డ్రైవర్‌పై దాడికి పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. వైరల్‌గా మారిన వీడియోను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us