ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కొరడా

| Edited By: Srinu

Jun 12, 2019 | 5:03 PM

హైదరాబాద్‌‌ను క్లీన్‌సిటీగా చేసేందుకు జీహెచ్‌ఎంసీ నడుముకట్టింది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్లు, బస్ స్టాప్‌లు, పార్క్‌ల వద్ద ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించేందుకు సిద్దమైంది. యూసుఫ్‌గూడ కృష్ణకాంత్‌ పార్కు ఫుట్‌పాత్ వద్ద కొద్ది రోజులుగా చిరువ్యాపారులు, తోపుడు బండ్లు, చాట్ బండ్లు వెలిశాయి. దీంతో ఫుట్‌పాత్ పై నడవాలంటేనే పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్‌పాత్ అంతా చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడంతో పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. చిరు వ్యాపారులు తమ బండ్ల వద్ద పేరుకుపోయిన వ్యార్థాలను అక్కడే వదిలేస్తున్నారు. […]

ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కొరడా
Follow us on

హైదరాబాద్‌‌ను క్లీన్‌సిటీగా చేసేందుకు జీహెచ్‌ఎంసీ నడుముకట్టింది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్లు, బస్ స్టాప్‌లు, పార్క్‌ల వద్ద ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించేందుకు సిద్దమైంది. యూసుఫ్‌గూడ కృష్ణకాంత్‌ పార్కు ఫుట్‌పాత్ వద్ద కొద్ది రోజులుగా చిరువ్యాపారులు, తోపుడు బండ్లు, చాట్ బండ్లు వెలిశాయి. దీంతో ఫుట్‌పాత్ పై నడవాలంటేనే పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్‌పాత్ అంతా చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడంతో పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. చిరు వ్యాపారులు తమ బండ్ల వద్ద పేరుకుపోయిన వ్యార్థాలను అక్కడే వదిలేస్తున్నారు. కొంతమంది పార్కు గోడపై ఏర్పాటు చేసిన జాలీల మధ్యలో నుంచి పార్కులో చెత్తను పడేస్తున్నారు. దీంతో పార్కులోకి వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై స్పందించిన అధికారులు.. టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ రజిత ఆద్వర్యంలో పార్కు ఎదురుగా ఫుట్‌పాత్ పై వెలిసిన చిన్నచిన్న షాపులు, తోపుడు బండ్లు, చాట్ బండ్లను తొలగించారు. మరోసారి ఫుట్‌పాత్‌ను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ రజిత హెచ్చరించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికే తమకు అన్యాయం చేయవద్దని.. వేరే ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను కోరారు.