Huzurabad By Election: అక్కా చెల్లెళ్ల అభయ హస్తం డబ్బులు.. వడ్డీతో సహా వాపస్ ఇస్తాంః మంత్రి హరీష్ రావు

|

Oct 06, 2021 | 8:15 PM

Harish rao in Huzurabad By Poll: మంత్రిగా ఉండి ఏమీ చేయలేని వారు.. రేపు గెలిస్తే ఏమీ అభివృద్ది చేస్తారు అని ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు.

Huzurabad By Election: అక్కా చెల్లెళ్ల అభయ హస్తం డబ్బులు.. వడ్డీతో సహా వాపస్ ఇస్తాంః మంత్రి హరీష్ రావు
Harishrao
Follow us on

Huzurabad By Election: మంత్రిగా ఉండి ఏమీ చేయలేని వారు.. రేపు గెలిస్తే ఏమీ అభివృద్ది చేస్తారు అని ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. తమ్మడిలా చూసుకున్న కేసీఆర్‌ను.. సంస్కారం లేకుండా ఇష్టమెచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పేదలంటే ఎంతో నిర్లక్ష్యం చూపే రాజేందర్.. నమ్మకద్రోహి అన్నారు. అన్ని కులాల వారికీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్ దేనని.. ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాది కేసీఆరే అని అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజా సంక్షేమ ఫలాలు అందాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి.. గెల్లు శ్రీనివాస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఈక్రమంలో కమలాపూర్ మండలం గూడూరులో నిర్వహించిన ధూం ధామ్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మల ఆటలతో.. ఆడి పాడిన గూడూరు అక్కా చెళ్లెళ్లు హరీష్ రావుకు ఘనస్వాగతం పలికారు. ఎన్నికలువస్తే ఏ పార్టీ గెలిస్తే లాభం.. కమలాపూర్, గూడూరు అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి ఆలోచించాలన్నారు హరీష్‌ రావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేదని, ఉన్నది రెండే పార్టీలు, ఒకటి టీఆర్ఎస్, రెండు బీజేపీ మాత్రమే అన్నారు.

ఈటల రాజేందర్ ఓటేయండి.. అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారన్న మంత్రి.. గెలిస్తే ఎం చేస్తారో చెప్పి ఓటు అడగాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడపిల్ల పెళ్లికి లక్ష 116 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. ఎకరానికి రైతు బంధు కింద అన్నదాతలకు పది వేల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు రూ.7,500 కోట్లు రైతు బంధు కింద ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

టీడీపీ, కాంగ్రెస్ హయాంలో రైతు అప్పులు పాలయి ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. కానీ సీఎం కేసీఆర్ రైతు ఏ కారణంతో చనిపోయినా ఐదు లక్షల రూపాయల రైతు బీమా ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్న హరీష్ రావు.. నల్ల చట్టాలయిన వ్యవసాయ చట్టాలను తెచ్చింది బీజేపీ ప్రభుత్వమన్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలని ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు మీద రైతులు ధర్నాలు చేస్తుంటే కార్లతో తొక్కించి చంపించింది బీజేపీ ప్రభుత్వమని మండిపడ్డారు. రైతు బందు, రైతు బీమా ఇచ్చిన టీఆర్ఎస్ ను గెలిపించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

ధరలు పెంచడం తప్ప బీజేపీ పేద ప్రజలకు చేసిందేమి లేదన్నారు. మాయమాటలు చెబుతున్నారు ఈటల రాజేందర్, తాను బురద అంటించుకుని అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారు. మనకు న్యాయం జరగాలంటే పేదలను పట్టించుకునే కేసీఆర్ ను గెలిపించాలన్నారు. రాబోయే రోజుల్లో అక్కా చెల్లెళ్లు అభయ హస్తం కోసం డబ్బులు కట్టారు. వాటిని వడ్డీతో సహా వాపస్ ఇస్తామన్నారు. రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ కూడా ఇస్తామన్నారు మంత్రి హరీష్ రావు.

Read Also…  Badvel By Election: బద్వేల్ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రయాంగిల్‌ వార్.. బరిలోకి బీజేపీ, కాంగ్రెస్..!