Wife Manhandling: బ్యాంకులో అందరూ చూస్తుండగానే భర్తకు దేహశుద్ధి చేసిన భార్య.. కారణమేంటంటే..

|

Jan 12, 2021 | 3:26 PM

Wife Manhandling: తనను వదిలించుకోవాలని చూసిన ఓ భర్తకు తన భార్య తగిన గుణపాఠం చెప్పింది. అతను పని చేస్తున్న బ్యాంకులో అందరూ చూస్తుండగానే

Wife Manhandling: బ్యాంకులో అందరూ చూస్తుండగానే భర్తకు దేహశుద్ధి చేసిన భార్య.. కారణమేంటంటే..
Follow us on

Wife Manhandling: తనను వదిలించుకోవాలని చూసిన ఓ భర్తకు తన భార్య తగిన గుణపాఠం చెప్పింది. అతను పని చేస్తున్న బ్యాంకులో అందరూ చూస్తుండగానే దేహశుద్ధి చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. వరంగల్‌కు చెందిన శ్రీనివాస్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. పది సంవత్సరాల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి పాప కూడా ఉంది. అయితే ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శ్రీనివాస్.. ఆమెను వదిలించుకోవాలని భావించాడు. ఆ క్రమంలో వేరొక మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

ఇది పసిగట్టిన అతని భార్య.. శ్రీనివాస్‌ను నిలదీసింది. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో ఇవాళ నేరుగా అతను పని చేస్తున్న బ్యాంకుకే వెళ్లింది. శ్రీనివాస్‌ను అందరి ముందే నిలదీసింది. ఆ క్రమంలో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ భార్య.. అందరూ చూస్తుండగానే అతన్ని ఉతికి ఆరేసింది. శ్రీనివాస్‌పై అతని భార్య దాడి చేస్తుండగా బ్యాంకు సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అమె వెనక్కి తగ్గలేదు. శ్రీనివాస్‌ను గల్లా పట్టి మరీ కొట్టింది. అనంతరం సదరు మహిళ తన భర్త శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read:

Assets Registration: పాస్‌పోర్ట్‌తో ఆస్తుల రిజిస్ట్రేషన్‌.. అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రైతుల ఆందోళన.. సుప్రీం కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఇలా ఉన్నాయి..