హుజూర్ నగర్‌ ఉపఎన్నికలో.. సీపీఐ మద్దతు ఎవరికి..?

| Edited By:

Oct 14, 2019 | 11:11 AM

తెలంగాణలో ఇప్పుడు రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వినిపిస్తున్నాయి. ఒకటి హూజుర్ నగర్ బైపోల్, రెండవది ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎక్కడ చూసిన.. ఎవరి నోట విన్నా ఈ రెండు అంశాలపైనే చర్చ జరుగుతోంది. మరోవైపు హుజుర్ నగర్ ఉపఎన్నికకు వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు అమీతుమీకి సిద్దమవుతున్నాయి. ఎలాగైనా తామే విజయం సాధించాలని వ్యూహారచన చేస్తున్నాయి. ఇక టీఆర్ఎస్‌కు ఇక్కడ విజయం సాధించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ […]

హుజూర్ నగర్‌ ఉపఎన్నికలో.. సీపీఐ మద్దతు ఎవరికి..?
Follow us on

తెలంగాణలో ఇప్పుడు రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వినిపిస్తున్నాయి. ఒకటి హూజుర్ నగర్ బైపోల్, రెండవది ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎక్కడ చూసిన.. ఎవరి నోట విన్నా ఈ రెండు అంశాలపైనే చర్చ జరుగుతోంది. మరోవైపు హుజుర్ నగర్ ఉపఎన్నికకు వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు అమీతుమీకి సిద్దమవుతున్నాయి. ఎలాగైనా తామే విజయం సాధించాలని వ్యూహారచన చేస్తున్నాయి.

ఇక టీఆర్ఎస్‌కు ఇక్కడ విజయం సాధించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం.. వారి డిమాండ్లను నెరవేర్చడానికి కేసీఆర్ ససేమిరా అనడంతో.. ప్రభుత్వం పై కార్మికుల్లో వ్యతిరేకత పెరిగింది. సమ్మె విరమించుకోవాలని ప్రభుత్వం చెప్పినా.. కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సమ్మె చేపట్టిన (సుమారు 48వేలకు పైగా ఆర్టీసీ ఉద్యోగులను) వారిని విధులు నుంచి తొలగించినప్పటికీ.. ఆర్టీసీ జేఏసీ నాయకులు మాత్రం వివిధ రకాలుగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకే రోజు ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం.. వీరి సమ్మేకు ఆజ్యం పోసినట్లైంది. కార్మికుల్లో ప్రభుత్వం పై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

మరోవైపు ఆర్టీసీ సమ్మెను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్‌ను ఓడించాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీలతో పాటు సీపీఐ కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతోంది. రెండు మూడు రోజుల్లో కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే.. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. సమ్మె విరణమకు ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే.. టీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడితే.. టీఆర్ఎస్‌కు కష్టకాలం వచ్చినట్లేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ మాత్రం పట్టు విడవటం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు సమ్మెలో పాల్గొన్న వారిని తొలగించి.. కొత్త వారితో నామమాత్రంగా బస్సులను నడిపిస్తున్నారు. ఇక త్వరలోనే మరికొంత మందిని ఆర్టీసీలో తీసుకోనున్నట్లు అందుకు సంబంధించి నోటీఫికేషన్ కూడా విడుదల చేశారు. సీపీఐ మద్దతును టీఆర్ఎస్ కోల్పోతే.. కొన్ని వందల ఓట్లను కోల్పోయినట్లే నని రాజకీయ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల్లో కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. సీపీఐ మద్దతు తెలుపే అవకాశం ఉందని అంటున్నారు. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు. హుజూర్ నగర్ బైపోల్‌లో విజయం ఏ పార్టీకి దక్కనుంది.. తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..