Watch Video: మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..

|

Jul 20, 2024 | 11:47 PM

మహానగరం హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. 7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్ చేశారు. హెరాయిన్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బస్సుల్లో తీసుకొస్తున్నట్లు ముఠాను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎస్‌ఓటీ శంషాబాద్‌, మాదాపూర్‌ పోలీసులు సంయుక్తంగా సోదాలు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Watch Video: మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..
Hyderabad Cp
Follow us on

మహానగరం హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. 7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్ చేశారు. హెరాయిన్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బస్సుల్లో తీసుకొస్తున్నట్లు ముఠాను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎస్‌ఓటీ శంషాబాద్‌, మాదాపూర్‌ పోలీసులు సంయుక్తంగా సోదాలు చేసి అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి.. హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. విదేశాల నుంచి రాజస్థాన్‌కు డ్రగ్స్‌ వస్తోందని తెలిపారు. నేమీచంద్‌, హరీష్ సిర్వి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. ముఖ్య సూత్రధారి సంతోష్‌ జోద్‌పూర్‌ డ్రగ్స్ కేసులో జైలులో ఉన్నాడని ఆయన బంధువు ద్వారా.. హెరాయిన్ హైదరాబాద్‌కి సప్లై అవుతుందని.. తద్వారా ముఠా విక్రయిస్తుందని చెప్పారు సీపీ మహంతి.

నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. పట్టుబడ్డ కాస్ట్‌లీ హెరాయిన్ విదేశాలనుంచి సప్లై అవుతుందన్నారు సీపీ. ప్రస్తుతానికి హెరాయిన్ సప్లయర్స్‎ని మాత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు సీపీ. హెరాయిన్ కన్జూమర్స్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఇప్పటికే పబ్బుల్లో నో డ్రగ్స్ బోర్డ్స్ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే డ్రగ్స్ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని మరికొందరికి టెస్ట్ చేశామన్నారు. పాజిటివ్ వస్తే వారిపేర్లను కూడా వెల్లడిస్తామన్నారు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..