ఇక వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాల్సిందే.. లేదంటే..

| Edited By:

Jun 11, 2020 | 8:39 PM

గత కొద్ది రోజులుగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వెనుకల కూర్చున్న వారు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు చున్నీ/ దుప్పట్టా లాంటివి వీల్‌లో ఇరుక్కుపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇక వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాల్సిందే.. లేదంటే..
Follow us on

గత కొద్ది రోజులుగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వెనుకల కూర్చున్న వారు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు చున్నీ/ దుప్పట్టా లాంటివి వీల్‌లో ఇరుక్కుపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్‌ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై టూ వీలర్‌పై వెనుకల కూర్చున్న వారు కూడా కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. ఇటీవల ఓ టూవీలర్ ప్రమాదంలో చున్నీ ఇరుక్కుపోవడంతో ప్రమాదం జరిగిందని.. ఇది విషాదకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా.. వెనుక కూర్చున్న మహిళలు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇటీవల జరిగిన టూ వీలర్‌ ప్రమాదంలో వెనుక కూర్చున్న వారు కూడా మరణించిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని.. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టూవీలర్స్‌పై ఇద్దరు వెళ్లినప్పుడు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్‌ ధరించకపోతే.. చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు.