నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీవర్షం.. పిడుగుపాటుకు రెండు పశువులు మృతి

| Edited By:

May 11, 2019 | 6:43 PM

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో భారీవర్షం కురిసింది. మన్ననూరు, మాచారం, అమ్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పెద్ద ఎత్తున చెట్లు నేలకొరిగాయి. అకాల వర్షంతో పాటు పిడుగులు రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. వెల్దండలో వర్షంతో పాటు వ్యవసాయ భూమిలో పిడుగు పడటంతో రెండు పాడి ఆవులు మృతి చెందగా… మూడు గడ్డివాములు దగ్ధమయ్యాయి. కాగా గత కొద్దిరోజులుగా ఎండలతో సతమతమవుతున్న జనానికి అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కాస్త […]

నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీవర్షం.. పిడుగుపాటుకు రెండు పశువులు మృతి
Follow us on

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో భారీవర్షం కురిసింది. మన్ననూరు, మాచారం, అమ్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పెద్ద ఎత్తున చెట్లు నేలకొరిగాయి. అకాల వర్షంతో పాటు పిడుగులు రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. వెల్దండలో వర్షంతో పాటు వ్యవసాయ భూమిలో పిడుగు పడటంతో రెండు పాడి ఆవులు మృతి చెందగా… మూడు గడ్డివాములు దగ్ధమయ్యాయి.

కాగా గత కొద్దిరోజులుగా ఎండలతో సతమతమవుతున్న జనానికి అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కాస్త ఊరట లభించింది. గత 10రోజులుగా నల్లమల అటవీప్రాంతంతో ఎండలు దంచికొడుతున్నాయి. కానీ ఈ రోజు భారీ వర్షం కురియడంతో వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.