మంచిర్యాలలో దంచికొట్టిన వడగళ్ల వాన..

| Edited By:

Apr 19, 2019 | 4:31 PM

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. భారీ గాలి దుమారంతో కూడిన వర్షం కారణంగా మామిడి, వరి, ఇతర వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెన్నూరులోని పద్మానగర్ ఐబీ వరకు చెట్లు ఇరువైపులా నేల కొరగడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. చెన్నూరు మండలంలోని లంబడిపల్లి, కిష్టం పేట, సుద్దాల, కమ్మర్ పల్లి, లింగంపల్లి, కత్తెరశాల, నారాయణ పూర్, చింతల పల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మామిడి […]

మంచిర్యాలలో దంచికొట్టిన వడగళ్ల వాన..
Follow us on

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. భారీ గాలి దుమారంతో కూడిన వర్షం కారణంగా మామిడి, వరి, ఇతర వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెన్నూరులోని పద్మానగర్ ఐబీ వరకు చెట్లు ఇరువైపులా నేల కొరగడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

చెన్నూరు మండలంలోని లంబడిపల్లి, కిష్టం పేట, సుద్దాల, కమ్మర్ పల్లి, లింగంపల్లి, కత్తెరశాల, నారాయణ పూర్, చింతల పల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మామిడి నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రైతులను తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో మిర్చి పంట సైతం దెబ్బతింది.