Telangana: వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్.. లంచ్ మోషన్ పిటిషన్ ఉపసంహరణ..

|

Jan 30, 2023 | 3:31 PM

తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గవర్నర్ బడ్జెట్ ను ఆమోదించడం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్..

Telangana: వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్.. లంచ్ మోషన్ పిటిషన్ ఉపసంహరణ..
Governor Vs Cm Kcr
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గవర్నర్ బడ్జెట్ ను ఆమోదించడం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ ధవే కోర్టుకు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గవర్నర్ తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని చెప్పారు. కాగా.. బడ్జెట్ ఆమోదంపై గవర్నర్ తమిళి సై అనుమతి తెలపకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. లంచ్ మోషన్ కు అనుమతించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. అయితే.. ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని న్యాయస్థానం కీలక వాఖ్య చేసింది. లంచ్ మోషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో అందుకు బెంచ్ అంగీకరించింది.

కాగా.. ఫిబ్రవరి మూడో తేదీన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా..? ఉండదా..? అనేది ఉత్కంఠ రేపుతోంది. గతేడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి కూడా అలాగే చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు.. కేసీఆర్‌ సర్కార్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం