Telangana: వంట చేస్తుండగా పెద్ద శబ్దం.. తీరా చూస్తే, పడగ విప్పి బుసలు గొట్టింది..!

| Edited By: Balaraju Goud

Aug 25, 2024 | 4:26 PM

పాములు సాధారణంగా ఇంటి పరిసరాలలో, లేదా అడవుల్లో గానీ, పుట్టల్లో కానీ కనపడుతుంటాయి. కానీ ఏకంగా వంట గదిలో ప్రత్యక్షమైంది ఓ నాగు పాము. పడగ విప్పి బుసలు గొట్టింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వెలుగు చూసింది.

Telangana: వంట చేస్తుండగా పెద్ద శబ్దం.. తీరా చూస్తే, పడగ విప్పి బుసలు గొట్టింది..!
King Cobra In Kichen
Follow us on

పాములు సాధారణంగా ఇంటి పరిసరాలలో, లేదా అడవుల్లో గానీ, పుట్టల్లో కానీ కనపడుతుంటాయి. కానీ ఏకంగా వంట గదిలో ప్రత్యక్షమైంది ఓ నాగు పాము. పడగ విప్పి బుసలు గొట్టింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో వెలుగు చూసింది.

అశ్వారావుపేటలో శనివారం(ఆగస్ట్ 24) సాయంత్రం సమయంలో వంట చేసేందుకు కిచెన్‌లోకి వెళ్లింది ఓ ఇల్లాలు. ఇంతలో వింత శబ్ధం వినిపించడంతో లేటు వేసి చూసింది. మహిళ గ్యాస్ పొయ్యి వద్ద పండగ విప్పిన నాగు పాము చూసి భయాందోళనకు గురి అయ్యింది. వెంటనే తేరుకుని భయపడి కేకలు వేస్తూ బయటకి పరుగులు తీసింది. ఈ అరుపులు విన్న స్థానికులు చేరుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. అతను వచ్చి ఆ నాగుపాము ను పట్టుకోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

అశ్వారావుపేట పట్టణంలో పెట్రోల్ బంక్ పక్కన మల్లికార్జునరావు ఇంట్లో అతని భార్య వంట చేసేందుకు కిచెన్ రూమ్‌లోకి వెళ్ళింది. అక్కడ నాగుపాము కనిపించింది. భయపడి కేకలు వేయడంతో చుట్టూ ప్రక్కల స్థానికులు వచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. స్నేక్ క్యాచర్ రావటానికి రెండు గంటల సమయం పట్టింది. ఆ రెండు గంటలసేపు నాగుపాము, అలాగే పడగ విప్పి ఉండడంతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వచ్చి నాగుపామును డబ్బాలో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ పామును ఫారెస్ట్ అధికారులు అడవిలో విడిచిపెట్టారు. నాగుపాము పడగ విప్పిన వీడియోలు, ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..