Watch Video: సిద్దిపేటకు మరో అరుదైన గుర్తింపు.. స్టీల్ బ్యాంకుకు జాతీయ స్థాయిలో ప్రశంసల వెల్లువ..

| Edited By: Srikar T

Jul 25, 2024 | 4:30 PM

సిద్దిపేట అన్నింటిలో ఆదర్శం. దేశస్థాయిలో అవార్డు వచ్చిందంటే సిద్దిపేట పేరులేకుండా ఉండదు. సిద్దిపేటలో ఏ కార్యక్రమం తలపెట్టినా దేశ, రాష్ట్రస్థాయిలో అమలు కావాల్సిందే. సిద్దిపేట ను చూసి నేర్చుకున్న దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఒక మారు మూల గ్రామం అయిన ఇబ్రహీంపూర్‎లో ఇంకుడు గుంతల కార్యక్రమం చేపడితే దేశ, విదేశాల మన్నలని పొందింది. అదే స్ఫూర్తి‎తో ఎన్నో కార్యక్రమాలకు సిద్దిపేట వేదిక అయింది.

Watch Video: సిద్దిపేటకు మరో అరుదైన గుర్తింపు.. స్టీల్ బ్యాంకుకు జాతీయ స్థాయిలో ప్రశంసల వెల్లువ..
Harish Rao
Follow us on

సిద్దిపేట అన్నింటిలో ఆదర్శం. దేశస్థాయిలో అవార్డు వచ్చిందంటే సిద్దిపేట పేరులేకుండా ఉండదు. సిద్దిపేటలో ఏ కార్యక్రమం తలపెట్టినా దేశ, రాష్ట్రస్థాయిలో అమలు కావాల్సిందే. సిద్దిపేట ను చూసి నేర్చుకున్న దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఒక మారు మూల గ్రామం అయిన ఇబ్రహీంపూర్‎లో ఇంకుడు గుంతల కార్యక్రమం చేపడితే దేశ, విదేశాల మన్నలని పొందింది. అదే స్ఫూర్తి‎తో ఎన్నో కార్యక్రమాలకు సిద్దిపేట వేదిక అయింది. అందులో భాగంగా సిద్దిపేటలో స్టీల్ బ్యాంక్ అనే కొత్త వినూత్న కార్యక్రమంను గత కొద్ది నెలల క్రితం మంత్రి హోదాలో హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంలామారాలని ప్రజల్లో గొప్ప చైతన్యం తెచ్చారు. అందులో భాగంగా.. వార్డ్, వార్డ్‎లో స్టీల్ బ్యాంక్ ను తీసుకొచ్చారు. ఈ స్టీల్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశ్యం వార్డ్‎లో ప్రజలు ప్లాస్టిక్ గ్లాస్‎లు, ప్లేట్స్‎వాడొద్దు అని సూచించారు. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఈ స్టీల్ బ్యాంక్ నుండే తీసుకపోవాలి.. అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

సిద్దిపేట పట్టణంలో 43వార్డులకుగానూ 34 వార్డుల్లో ఈ కార్యక్రమం పూర్తి కాగా.. ఇదే స్ఫూర్తితో మరిన్ని గ్రామీణ ప్రాంతాలకి సాగింది ఈ కార్యక్రమం. ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఇక్కడి పాలకులు, ప్రజలు స్టీల్ బ్యాంక్ అనే వినూత్న కార్యక్రమం తీసుకోవడం అద్భుతం అని కేంద్రం మెచ్చింది. ప్రతి యేటా విలువరించే పార్లమెంట్ ఎకనామిక్ సర్వే అఫ్ ఇండియా బుక్‎లో “సిద్దిపేట స్టీల్ బ్యాంక్” గొప్ప కార్యక్రమం అని.. అద్భుతమని కొనియాడారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా దేశంలో ఉండే ప్రత్యేక కార్యక్రమాలు బుక్‎లో ప్రచురణ చేస్తారు. అందులో భాగంగా మన సిద్దిపేట స్టీల్ బ్యాంక్‎ను ఆ బుక్‎లో ప్రచురణ చేశారు. ఈ స్టీల్ బ్యాంక్ స్ఫూర్తి దేశం మొత్తం అమలు పరుస్తాం అని ప్రచురణలో తెలిపారు. చేసే పనుల్లో సార్థకత వచ్చినపుడు గొప్ప సంతృప్తి ఉంటుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఒక పని మొదలు పెట్టినప్పుడు అవుతుందా కాదా అనే ఆలోచనతో మొదలు పెడతాం.. సిద్దిపేట ప్రజల అదృష్టం ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టిన సిద్దిస్తుందని కీర్తించారు. పార్లమెంట్ ఎకానమిక్ సర్వే అఫ్ ఇండియా బుక్‎లో సిద్దిపేట స్టీల్ బ్యాంక్ చాలా మంచి కార్యక్రమం అని ప్రచురణ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో మరో రికార్డ్ సాధించడం గొప్ప సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ సందర్బంగా స్టీల్ బ్యాంక్ కార్యక్రమంలో పాలుపంచుకున్న సిద్దిపేట ప్రజలకు అధికారులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..