ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. వనమహోత్సవంలో నటుడు సుమన్..

|

Jul 16, 2024 | 7:14 PM

సిద్ధిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి ప్రశాంతినికేతనంలో వన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఆయనకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సత్యసాయి ప్రశాంతి నిలయం కళాశాలకు తొలిసారిగా విచ్చేసిన సుమన్.. వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటారు.

ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. వనమహోత్సవంలో నటుడు సుమన్..
Actor Suman
Follow us on

సిద్ధిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి ప్రశాంతినికేతనంలో వన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఆయనకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సత్యసాయి ప్రశాంతి నిలయం కళాశాలకు తొలిసారిగా విచ్చేసిన సుమన్.. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పరిసరాలను వీక్షించారు. పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న విద్యాలయాన్ని చూసిన ఆయన ముగ్దులయ్యారు. ఇలాంటి వాతావరణంలో విద్యాలయం ఏర్పాటు చేయడం విద్యార్థులకు ఓ వరం అన్నారు.

పేద పిల్లలకు సమున్నత విద్యను అందిస్తూ వారి బాగోగుల్ని చూసుకుంటూ ట్రస్టు సేవల్ని ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ పూర్ణిమా శంకర్‌తో పాటు సెక్రటరీ శంకర్, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నిజానికి The End of The Education is Character అన్న సత్యసాయిబాబా ప్రవచించిన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్న పాఠశాల సత్యసాయి ప్రశాంతినికేతనం. ఇక్కడ చదువు మాత్రమే కాదు.. ఇక్కడ చేరే విద్యార్థికి సంబంధించి పూర్తి బాధ్యత సంస్థదే. విద్యను ఉచితంగా అందించాలన్న ధ్యేయంతో సద్గురు మధుసూధన్ సాయి సిద్ధిపేట జిల్లా కొండపాకలో 2017లో దీనిని ప్రారంభించారు. ఇక్కడ చేరే విద్యార్థులకు చదువుతో పాటు వసతి, ఇతర అన్ని అవసరాలను ట్రస్టే సమకూరుస్తుంది. పూర్తిగా గురుకుల పద్ధతిలో నడిచే ఈ పాఠశాలలో చేరే విద్యార్థులు చదువుపై తప్ప మరే ఇతర అవసరాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితే రాకూడదన్నది నిర్వహాకుల లక్ష్యం. అందుకే హాస్టల్లో చేరే విద్యార్థి కేవలం ఒక్క జత దుస్తులతో వస్తే చాలు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువు పూర్తి చెయ్యచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..