TRS vs BJP: పీక్స్‌కు చేరిన తెలంగాణలో కారు, కమలం మధ్య ఫైట్‌.. పోరుకు సిద్ధమవుతున్న బీజేపీ

|

Apr 20, 2022 | 8:06 AM

తెలంగాణలో కారు, కమలం మధ్య ఫైట్‌ పీక్స్‌కు చేరింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతోంది కాషాయ పార్టీ.

TRS vs BJP: పీక్స్‌కు చేరిన తెలంగాణలో కారు, కమలం మధ్య ఫైట్‌.. పోరుకు సిద్ధమవుతున్న బీజేపీ
Trs Bjp
Follow us on

BJP vs TRS:  భారతీయ జనతా పార్టీ వర్సెస్‌ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణలో కారు, కమలం మధ్య ఫైట్‌ పీక్స్‌కు చేరింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతోంది కాషాయ పార్టీ. రామాయంపేట, ఖమ్మం ఘటనలపై పోరుబాట పట్టింది. ఇవాళ గవర్నర్‌తో భేటీ కానుంది తెలంగాణ బీజేపీ బృందం. రామాయంపేట, ఖమ్మం ఘటనలపై ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ఇవాళ ఖమ్మంలో సాయి గణేస్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు కేంద్రమంత్రి చంద్రశేఖర్‌. ఇక బీజేపీ లీగల్‌ సెల్‌ టీమ్‌ రామాయంపేట, ఖమ్మంలో పర్యటించనుంది.

మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతల తీరుకు నిరసనగా దీక్షలకు పిలుపునిచ్చింది బీజేపీ. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య సహా రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అరాచకాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం గవర్నర్ తమిళిసైని కలిసి పార్టీ రాష్ట్ర నేతలు వినతిపత్రం ఇస్తారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. ఖమ్మం టౌన్ లో టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులకు తాళలేక సాయిగణేష్ సూసైడ్ చేసుకున్నాడని, కొత్తగూడెంలో ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవ వేధింపులకు రామకృష్ణ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని, రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ సహా ఆ పార్టీ నేతల బెదిరింపులతో గంగం సంతోష్, అతని తల్లి ఆత్మాహుతికి పాల్పడ్డారని సంజయ్ గుర్తుచేశారు.

మరోవైపు, సూర్యాపేట జిల్లా కోదాడలో స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు స్నేహితులతో కలిసి ఓ యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటనను సంజయ్ ఖండించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అధికార పార్టీ ఆగడాలను ఖండించాలని సంజయ్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ గద్వాల్‌లో పాదయాత్ర శిబిరం దగ్గర బండి సంజయ్‌ దీక్షకు దిగనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతారు. సాయిగణేష్‌ మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి కూడా రామాయంపేట ఘటనపై ఆందోళనలకు సిద్ధమయ్యారు. రామాయంపేట పీఎస్‌ ఎదుట ధర్నా చేపడుతున్నారు. సంతోష్‌, అతని తల్లి ఆత్మహత్యకు కారణమైన నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read Also….  Medical Seats Scam: తెలంగాణలో బయటపడిన మరో బిగ్‌ మెడికల్‌ స్కామ్‌.. ఒక్కో పీజీ సీటు ఎంతకు అమ్ముకున్నారో తెలుసా?