Telangana : 12 బంగారు గాజులను బ్యాంకు వేలంలో పాడుకున్న వ్యక్తి.. తెల్లారి ఊహించని ట్విస్ట్

|

Jun 23, 2022 | 8:50 PM

బ్యాంకు వారు బంగారం వేలం వేస్తున్నారంటే కాస్త తక్కువ రేటుకు వస్తుందని ఆశగా వెళ్లాడు. 12 బంగారు గాజులను వేలంలో పాడుకున్నాడు. కానీ తెల్లారే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

Telangana : 12 బంగారు గాజులను బ్యాంకు వేలంలో పాడుకున్న వ్యక్తి.. తెల్లారి ఊహించని ట్విస్ట్
Telangana News
Follow us on

కాస్త తక్కువ రేటుకు వస్తుందని చెప్పి… బ్యాంకు వేలంపాటలో బంగారాన్ని పాడుకున్నాడు ఓ వ్యక్తి. కానీ అతని ఊహించని షాక్ ఎదురైంది. ఆ బంగారమంతా నకిలీదని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నవారు.. తిరిగి డబ్బు చెల్లించకపోతే బ్యాంకు సదరు గోల్డ్‌ అమ్మేందుకు వేలంపాట నిర్వహిస్తుంది. అదే విధంగా  ఈ ఏడాది మార్చిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) మణుగూరు(Manuguru)లోని స్టేట్ బ్యాంక్ శాఖ వేలం పాట నిర్వహించింది. ఖమ్మం జిల్లా(Khammam District) వైరా మండలానికి చెందిన రూపాచారి రూ.6,81,500లకు 12 బంగారు గాజులను వేలంలో దక్కించుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. తర్వాతి రోజు ఆ గాజులను తీస్కోని.. గోల్డ్ షాపు వెళ్లగా.. మైండ్ బ్లాంక్ అయ్యే విషయం తెలిసింది. గాజుల పైన ఉన్న పొర తప్ప మిగతాదంతా ఇత్తడి, రాగి అని తేలింది. దీంతో రూపాచారి  లబోదిబోమంటూ  బ్యాంకు అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. బ్రాంచి మేనేజరుకి పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  అయినా ఇప్పటివరకు బ్యాంక్ నుంచి నో అప్‌డేట్. దీంతో అధికారులు తనకు న్యాయం చేసేలా చూడాలని అతడు మీడియాను ఆశ్రయించాడు.

తెలంగాణ వార్తల కోసం..