శివాలయంలో గుప్తనిధులు..! కోట గడ్డలో పురాతన నాణేలు .!

| Edited By: Pardhasaradhi Peri

Feb 25, 2020 | 12:50 PM

పురాతన ఆలయాలు, ప్రాచీన కట్టడాలను విధ్వంసం చేస్తూ దుండగులు గుప్త నిధుల వేట సాగిస్తున్నారు. పలానా ఆలయ సమీపంలో అనో, లేదంటే పలానా గ్రామంలో ఉన్నాయనో పేరుతో ప్రజల్ని కూడా నమ్మించే యత్నం చేస్తున్నారు

శివాలయంలో గుప్తనిధులు..! కోట గడ్డలో పురాతన నాణేలు .!
Follow us on

పురాతన ఆలయాలు, ప్రాచీన కట్టడాలను విధ్వంసం చేస్తూ దుండగులు గుప్త నిధుల వేట సాగిస్తున్నారు. పలానా ఆలయ సమీపంలోనో, లేదంటే పలానా గ్రామంలో ఉన్నాయనో పేరుతో ప్రజల్ని కూడా నమ్మించే యత్నం చేస్తున్నారు. అంతేకాదు.. మరికొందరు ఏకంగా గుప్తునిధులు లభించాలంటే నరబలి ఇవ్వాలని చెబుతున్న సందర్భాలూ నివ్వెరపరిస్తున్నాయి.

తాజాగా కొమురం భీం జిల్లా పెంచికల్‌పేట మండలంలోని పోతేపల్లిలో గుప్తునిధుల తవ్వకాలు కలకలం రేపింది. గ్రామ శివాలయంలో గుప్త నిధులున్నాయన్న నెపంతో అర్ధరాత్రి సమయంలో తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పది మంది నిందితులు దొరికారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో కూడా గుప్త నిధులు కలకలం సృష్టిస్తోంది.. ఆ నోటా ఈ నోటా పడి చివరకు పోలీసులకు సమాచారం చేరగా.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 51 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. కోటగడ్డ గ్రామానికి చెందిన ఓ రైతు తన మామిడి తోటలో మామిడి చెట్లు నాటే నిమిత్తం జెసిబి ద్వారా 30 గుంటలు తవ్వారు. ఆ గుంతలను పుడ్చే క్రమంలో తీసిన మట్టి నుంచి చిన్న మట్టికుండ బయటపడింది. ఇందులోంచే పురాతన నాణాలు లభ్యమయ్యాయి.

నాణాల విషయం అక్కడ పనిచేసే కూలీలతో పాటు మిగతా వారికి తెలిసింది. మూడునెలల క్రితమే ఈ ఘటన జరిగింది. అయితే యజమాని వాటిని ఎవరికీ ఇవ్వకపోయే సరికి.. ఆ సమయంలో పనిచేసిన వారు కొందరు ఈ సమాచారాన్ని చేరవేశారు. వాటిని రెవెన్యూ అధికారులు.. పరీక్షించగా కాకతీయుల కాలంనాటి నాణాలని తేలింది. అయితే ఈ కోటగడ్డ ప్రాంతంలో కాకతీయులు నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు ఉండటం విశేషం. ఈ ఊర్లోనే కాకతీయులు నిర్మించిన శివాలయం ఉంది. ఇందులో 455 నాణాలు లభ్యమైనట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.