‘ప్రజా సేవకు పదవి అవసరం లేదు’: హరీష్ రావు

| Edited By:

Jun 28, 2019 | 3:20 PM

ప్రజా సేవ చేయడానికి పదవులే అవసరం లేదని… పనిచేయాలని ఉంటే ఎలాగైనా చేయవచ్చని తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో పదవీ విరమణ అంటూ ఉండదని ఆయన అన్నారు. సంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ రాజమణి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. ‘‘ఈ వీడ్కోలు పదవికే కానీ.. మన సంబంధాలు, ప్రజా సేవకు కాదు. మంచిగా ఆలోచించండి.. […]

ప్రజా సేవకు పదవి అవసరం లేదు: హరీష్ రావు
Follow us on

ప్రజా సేవ చేయడానికి పదవులే అవసరం లేదని… పనిచేయాలని ఉంటే ఎలాగైనా చేయవచ్చని తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో పదవీ విరమణ అంటూ ఉండదని ఆయన అన్నారు.

సంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ రాజమణి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. ‘‘ఈ వీడ్కోలు పదవికే కానీ.. మన సంబంధాలు, ప్రజా సేవకు కాదు. మంచిగా ఆలోచించండి.. మంచిగా జీవించండి.’’ అని హరీష్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వంలో కరెంట్ సమస్య లేకుండా పోయిందన్నారు. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ అడిగినన్ని ట్రాన్స్ ఫార్మర్‌లు ఇచ్చారని ఈ సందర్భంగా హరీష్ చెప్పుకొచ్చారు. గతంలో మంచి నీటి సమస్య బాగా ఉండేదని… మిషన్ భగీరథ వచ్చాక 90 శాతం సమస్య తీరిందన్నారు.