ఏ పార్టీ గుర్తులు, బ్యానర్లు కనిపించకూడదు -రజత్‌కుమార్

| Edited By:

Mar 11, 2019 | 10:56 AM

ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎన్నికల గుర్తులు ఎక్కడా కనిపించడానికి వీలు లేదన్నారు. 17 లోక్‌సభ స్థానాలకు గాను..ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నామినేషన్ వేయడానికి వెళ్లేవారికి మూడు వాహనాలకే అనుమతిస్తామన్నారు. తెలంగాణలో రెండు కోట్ల 95 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 34 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, ప్రచార ప్రకటనలు ఉండరాదన్నారు […]

ఏ పార్టీ గుర్తులు, బ్యానర్లు కనిపించకూడదు -రజత్‌కుమార్
Follow us on

ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎన్నికల గుర్తులు ఎక్కడా కనిపించడానికి వీలు లేదన్నారు. 17 లోక్‌సభ స్థానాలకు గాను..ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నామినేషన్ వేయడానికి వెళ్లేవారికి మూడు వాహనాలకే అనుమతిస్తామన్నారు. తెలంగాణలో రెండు కోట్ల 95 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 34 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, ప్రచార ప్రకటనలు ఉండరాదన్నారు రజత్ కుమార్. ఎక్కడ కూడా పార్టీ వ్యక్తుల ఫొటోలు కనిపించకూడదన్నారు. మంత్రులు అధికారిక వాహనాలు వినియోగించొద్దన్నారు. ఓటు వేసేందుకు వచ్చే వారు ఓటరు గుర్తింపు కార్డు తీసుకురావాలన్న రజత్ కుమర్.. లేని వారు ఏదైనా గవర్నమెంట్ ఐడీ కార్డు తీసుకురావాలన్నారు.