Watch Video: భార్యపై కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త.. చివరకు జరిగిందిదే..

| Edited By: Srikar T

Jun 09, 2024 | 10:41 AM

భార్యపై కోపంతో భర్త ఇల్లును తగులబెట్టాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‎లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనగర్‎కు చెందిన ముడారి బాలపోశయ్య అనే మత్స్యకారుడు ఇంటివద్ద చేపలు అమ్ముతూ, ఫ్రై చేసి విక్రయించేవాడు. భార్య రాజేశ్వరీతో కలిసి జీవిస్తున్నాడు. కాగా శనివారం మృగశిరకార్తే కావడంతో ఉదయం బయటకు వెళ్లి పీకల దాక మద్యం సేవించాడు. సాయంత్రం ఇంటికి రావడతో దంపతులకిద్దరి మధ్య గొడవ జరిగింది.

Watch Video: భార్యపై కోపంతో ఇంటికి నిప్పు పెట్టిన భర్త.. చివరకు జరిగిందిదే..
Fire Accident
Follow us on

భార్యపై కోపంతో భర్త ఇల్లును తగులబెట్టాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‎లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనగర్‎కు చెందిన ముడారి బాలపోశయ్య అనే మత్స్యకారుడు ఇంటివద్ద చేపలు అమ్ముతూ, ఫ్రై చేసి విక్రయించేవాడు. భార్య రాజేశ్వరీతో కలిసి జీవిస్తున్నాడు. కాగా శనివారం మృగశిరకార్తే కావడంతో ఉదయం బయటకు వెళ్లి పీకల దాక మద్యం సేవించాడు. సాయంత్రం ఇంటికి రావడతో దంపతులకిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్యన మాట మాట పెరిగి కోపోద్రిక్తుడైన బాలపోశయ్య మద్యం మత్తులో భార్య రాజేశ్వరిపై కిరోసిన్ పోశాడు. రాజేశ్వరి తేరుకొని కిరోసిన్ డబ్బాను భర్త నుండి లాక్కొని పక్కన విసిరేయడంతో ఇల్లంతా కిరోసిన్ పారింది. ఇదే సమయంలో అగ్గిపెట్టె తీసుకొని ఇంటిలో నిప్పంటించాడు భర్త. గమనించిన భార్య రాజేశ్వరీ ప్రాణభయంతో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తింది.

ఒక్కసారిగా ఇల్లంతా మంటలు వ్యాప్తించడంతో ఆ వేడి తట్టుకోలేక బాలపోశయ్య కూడా బయటకు పరుగులు తీశాడు. అక్కడ ఉన్న స్థానికులకు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడంతో సిరిసిల్ల నుండి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అదే క్రమంలో ఇంట్లో మూడు సిలిండర్ ఉన్నాయని ఫైర్ సిబ్బంది చెప్పడంతో ముందస్తుగా సిలిండర్లను బయటకు తీశారు. దీంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నాను. ఇంటి బయట నిలిపిన ద్విచక్రవాహనానికి మంటలు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది. అంతేకాకుండా మంటలు పక్కింటికి వ్యాపించి వారి ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. అప్పటికే మంటల వేడికి పెంకుటిల్లు కాలి, కూలింది. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..