Disha Encounter: ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిషన్‌కు మరో ఆరు నెలల గడువు పొడిగింపు

|

Jan 30, 2021 | 5:53 AM

Disha Encounter: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నియమించిన త్రిసభ్య కమిషన్‌ గడువును సుప్రీం కోర్టు మరో ఆరు నెలల పాటు..

Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిషన్‌కు మరో ఆరు నెలల గడువు పొడిగింపు
Follow us on

Disha Encounter: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నియమించిన త్రిసభ్య కమిషన్‌ గడువును సుప్రీం కోర్టు మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2019 డిసెంబర్‌ 12న విచారణ కమిషన్‌ను సుప్రీం కోర్టు నియమించగా, రెండో సారి గడువు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ఘటనలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పర్కర్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ ఈ ఘటనపై న్యాయ విచారణ జరుపుతోంది. అయితే ఈ కమిషన్‌ హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తుందని కమిషన్‌ విధులు ప్రారంభించిన తొలి రోజు నుంచి ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని నాటి ఆదేశాల్లో సుప్రీం కోర్టు పేర్కొంది. తాజాగా మరో సారి గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read: Jammu And Kashmir: జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌… భ‌ద్ర‌తా ద‌ళాల చేతిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం…