‘దిశ’ కేసు నిందితుల మృతదేహాలు తరలింపు..

|

Dec 08, 2019 | 10:36 AM

మహబూబ్‌నగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌ మార్చురీలో భద్రపరిచి ఉంచిన దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల మృతదేహాలను పోలీసులు శనివారం అర్ధరాత్రి జిల్లా శివారులోని మయూరి పార్క్ దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాల నూతన భవనానికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున డెడ్ బాడీస్‌ను తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు నిందితుల మృతదేహాలను శనివారం మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో పరిశీలించడమే కాకుండా చటాన్‌‌పల్లి బ్రిడ్జ్ […]

దిశ కేసు నిందితుల మృతదేహాలు తరలింపు..
Follow us on

మహబూబ్‌నగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌ మార్చురీలో భద్రపరిచి ఉంచిన దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల మృతదేహాలను పోలీసులు శనివారం అర్ధరాత్రి జిల్లా శివారులోని మయూరి పార్క్ దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాల నూతన భవనానికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున డెడ్ బాడీస్‌ను తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు నిందితుల మృతదేహాలను శనివారం మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో పరిశీలించడమే కాకుండా చటాన్‌‌పల్లి బ్రిడ్జ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ స్థలాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇదిలా ఉండగా.. మార్చురీలో ఉన్న నలుగురి నిందితుల డెడ్‌ బాడీస్ డీ- కంపోజ్ అయ్యాయని, వాటిని వెంటనే వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 9 వరకు మృతదేహాలను భద్రపరచాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 6వ తేదీన చటాన్‌‌పల్లి బ్రిడ్జ్ వద్ద సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసులపై దాడికి యత్నించగా.. ఆత్మరక్షణలో భాగంగా వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు.