Telangana: ఎంతపనిచేశావయ్యా..! క్షణికావేశం.. రెండు ప్రాణాలు.. తండ్రిని కాపాడబోయి కూతురు..

| Edited By: Shaik Madar Saheb

Jul 02, 2024 | 6:22 PM

క్షణికావేశం ఆ కుటుంబంలో రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన తండ్రిని కాపాడబోయిన కూతురు సైతం దుర్మరణం పొందింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Telangana: ఎంతపనిచేశావయ్యా..! క్షణికావేశం.. రెండు ప్రాణాలు.. తండ్రిని కాపాడబోయి కూతురు..
Crime News
Follow us on

తండ్రి, కూతురి మరణవార్త మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ప్రాంతంలో పెనూ విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన తండ్రి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో తండ్రిని అనుసరించి రక్షించాలని ప్రయత్నం చేసింది కూతురు. ఈ క్రమంలో తండ్రి, కూతురు ఇద్దరు రైలు కింద పడి దుర్మరణం చెందారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్లికి చెందిన శివానంద్(46) కొన్నేళ్ల క్రితం మహబూబ్ నగర్ లో కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని SVS ఆస్పత్రిలో డ్రైవర్ గా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటుండగా కుమారుడు సాయికృష్ణ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కూతురు చందన(17) SVSలోనే డీఎంఎల్టీ చదువుతోంది.

అయితే ఊరు కానీ ఊరు వచ్చినా దొరికిన పని చేసూకుంటూ కుటుంబం మంచిగానే సాగుతోంది. ఎంతొకొంత వచ్చిన కొంత జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు శివానంద్. ఎక్కడా ఎవరి వద్ద మాట పడలేదు. డ్రైవర్ ఉద్యోగమే అయినా చాలా నిజాయితీగా ఉండేవాడు. తోటివారితో ఎంతో కలిసిమెలిసి పనిచేసుకునే వాడు. కుటుంబం, అటూ ఉద్యోగం అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. అనుకోకుండా ఆ కుటుంబంలో సెల్ ఫోన్ గేమ్స్ చిచ్చు రేగింది. కొద్ది రోజులుగా కుమారుడు సెల్ ఫోన్లో గేమ్స్ బాగా అడిక్ట్ అయ్యాడు. గతరాత్రి అది గమనించిన తండ్రి శివానంద్ త్వరలోనే పరీక్షలు ఉన్నాయని ఫోన్ లో గేమ్స్ ఎందుకు ఆడుతున్నావని కుమారుడుని గట్టిగా మందలించాడు.

ఈ క్రమంలో కుమారుడిని తిట్టవద్దని తల్లి జోక్యం చేసుకొని శివానంద్ ను నిలువరించింది. కుమారుడు, భార్య తన మాటకు ఎదురుతిరిగారని మనస్థాపం చెందిన తండ్రి శివానంద్ ఇంట్లోనుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు. కాలనీకి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వైపు ప్రయాణం సాగించాడు. వెంటనే తండ్రి ఆవేశాన్ని గమనించిన కూతురు ఆయనను అనుసరిస్తూ వెళ్లింది. అప్పుడే అటూ వైపు నుంచి వెళ్తున్న అమరావతి ఎక్స్ ప్రెస్ రైలుకు అడ్డుగా త్రండీ వెళ్లబోయాడు. నాన్న వద్దు నాన్న వద్దు అంటూ కూతురు ఎంత అరిచిన వినిపించుకోలేదు. దీంతో చేసేది లేక తండ్రీని కాపాడే ప్రయత్నం చేసింది కూతురు చందన. ఈ క్రమంలో ఇరువురు రైలు కింద పడి మృతి చెందారు.

విషయం తెలుసుకున్న శివానంద్ భార్య సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంతో తండ్రి తీసుకున్న అనాలోచిన నిర్ణయానికి ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. తండ్రి, కూతురు రైలు ఢీకొని మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..