D Srinivas: డీఎస్ ప్రస్థానం ఇదే.. అధికారిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం రేవంత్

|

Jun 30, 2024 | 8:35 AM

D Srinivas passes away: నిజామాబాద్​లో ఇవాళ అధికారిక లాంఛనాలతో డీ శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి.శ్రీనివాస్.. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ కన్నుమూశారు.

D Srinivas: డీఎస్ ప్రస్థానం ఇదే.. అధికారిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం రేవంత్
D Srinivas
Follow us on

D Srinivas passes away: నిజామాబాద్​లో ఇవాళ అధికారిక లాంఛనాలతో డీ శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి.శ్రీనివాస్.. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ కన్నుమూశారు. డీఎస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు.. రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం..

దాదాపు 40 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి.శ్రీనివాస్.. డీఎస్‌గా, శీనన్నగా సుపరిచితులు. బీసీ నేతగా, తెలంగాణవాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా గుర్తింపు పొందారు. నిజామాబాద్​జిల్లా వేల్పూర్ ​మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 సెప్టెంబర్ 27న డీఎస్ ​జన్మించారు. హైదరాబాద్​ నిజాం కాలేజీలో బీకాం డిగ్రీ, తర్వాత లా పూర్తి చేశారు. 1974 నుంచి 84 దాకా రిజర్వ్ బ్యాంకులో పని చేశారు. ఆ టైమ్​లో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఇందిరాగాంధీ పిలుపు మేరకు జాబ్​కు ​రిజైన్ ​చేసి ఎన్ఎస్​యూఐలో చేరారు.

డీఎస్​లోని లీడర్​షిప్ ​క్వాలిటీస్ ​గ్రహించిన ఇందిరాగాంధీ.. ఆయనను ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ఎస్​యూఐ స్టేట్ ​ప్రెసిడెంట్ ​చేశారు. అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన డీఎస్.. పార్టీలో​అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, జనరల్​సెక్రటరీగా, 2004, 2009లో పీసీసీ ప్రెసిడెంట్​గా పని చేశారు. ఇక 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్‌లో చేరిన డీఎస్.. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత.. ఆయన ఆరోగ్యం క్షీణించటంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..