‘ఆఖరీ సఫర్‌’తో విరిసిన మానవత..పాడెమోసిన మేయర్

|

Jun 16, 2019 | 4:35 PM

కరీంనగర్‌: ‘ఆఖరీ సఫర్‌’ పేరుతో రూపాయికే అంత్యక్రియలు నిర్వహించాలనే విశిష్ఠ కార్యక్రామానికి శ్రీకారం చుట్టిన కరీంనగర్ మేయర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు, సామాజిక వేత్తలు అభినందించిన విషయం తెలిసిందే.  అంత్యక్రియల వ్యయం పేదలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కరీంనగర్‌ నగరపాలక సంస్థ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మేయర్ రవీందర్‌ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. భవానీ నగర్‌లో సాధారణ మరణం పొందిన మంచాల లలిత అంతిమయాత్రలో మేయర్ పాల్గొని స్వయంగా పాడె మోశారు. అంత్యక్రియలకు సంబంధించిన […]

ఆఖరీ సఫర్‌తో విరిసిన మానవత..పాడెమోసిన మేయర్
Follow us on

కరీంనగర్‌: ‘ఆఖరీ సఫర్‌’ పేరుతో రూపాయికే అంత్యక్రియలు నిర్వహించాలనే విశిష్ఠ కార్యక్రామానికి శ్రీకారం చుట్టిన కరీంనగర్ మేయర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు, సామాజిక వేత్తలు అభినందించిన విషయం తెలిసిందే.  అంత్యక్రియల వ్యయం పేదలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కరీంనగర్‌ నగరపాలక సంస్థ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మేయర్ రవీందర్‌ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. భవానీ నగర్‌లో సాధారణ మరణం పొందిన మంచాల లలిత అంతిమయాత్రలో మేయర్ పాల్గొని స్వయంగా పాడె మోశారు. అంత్యక్రియలకు సంబంధించిన తొలి రసీదును లలిత భర్తకు అందించారు.

వృద్ధులకు పింఛన్‌ పంపిణీ సందర్భంలో ప్రతి నెలా రూ.100లను అంతిమ సంస్కారాలకు దాచుకుంటున్నామని పలువురు తన దృష్టికి తీసుకురావడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ చెప్పారు. పేదలకు అంతిమ సంస్కారాలు భారం కాకూడదన్నదే తన ఉద్దేశమని, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని సూచించారు. గతంలో రూపాయికే నల్లా పథకానికి ఇక్కడి నుంచే అంకురార్పణ జరిగిందని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా  ‘ఆఖరీ సఫర్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మేయర్ వివరించారు.