అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు కరీంనగర్ కోర్టు ఆదేశం!

| Edited By: Pardhasaradhi Peri

Aug 01, 2019 | 4:48 PM

ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా కోర్టు బుధవారం (జులై 31) పోలీసులను ఆదేశించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి సాక్ష్యాధారాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఐపీసీ సెక్షన్ 153ఏ, 153బి, 506ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని పట్టణ పోలీసులకు సూచించింది. కరీంనగర్‌లో గత నెల […]

అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు కరీంనగర్ కోర్టు ఆదేశం!
Follow us on

ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా కోర్టు బుధవారం (జులై 31) పోలీసులను ఆదేశించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి సాక్ష్యాధారాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఐపీసీ సెక్షన్ 153ఏ, 153బి, 506ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని పట్టణ పోలీసులకు సూచించింది. కరీంనగర్‌లో గత నెల 24న స్థానికంగా నిర్వహించిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా అక్బరుద్దీన్ చేసిన ప్రసంగిస్తూ కరీంనగర్‌లో బీజేపీ గెలవడం తనను చాలా ఆవేదనకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని వీడియో సాక్ష్యాలు సమర్పించడంతో కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.