సభకు నమస్కారం…అసెంబ్లీ ఆవరణలో కరోనా ఎఫెక్ట్..!

|

Mar 06, 2020 | 1:30 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ..

సభకు నమస్కారం...అసెంబ్లీ ఆవరణలో కరోనా ఎఫెక్ట్..!
Follow us on

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో నిలబడి ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్యేలకు స్వాగతం పలికే సమయంలో ఎమ్మెల్యేలు సహజంగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు రాగా బాజిరెడ్డి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేశాడు. అయితే కరచాలనం వద్దు.. నమస్కారాలు ముద్దు అని సూచించారు. మంత్రి కేటీఆర్‌ సహా..ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు.. తమ సహచరులకు నమస్కారం అంటూ చేతులు జోడించి ముందుకెళ్లారు.

అయితే, మొదట షాకైన ఎమ్మెల్యేలు ఆ వెంటనే అసలు విషయాన్ని గ్రహించారు. కరోనా వైరస్ కారణంగా చేతులు కలపకుడా .. నవ్వుతు నమస్కరం చేసి భుజం తట్టి లోపలికి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా లేకపోయినా ప్రజల్లో అవగాహనా కల్గించేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా తెలుగు రాష్ట్రాల్లో లేదని, విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రమే సోకినట్టుగా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో చోటు చేసుకున్న ఈ సంఘటన కూడా ఓ మంచి మెసెజ్‌ని ప్రజలకు చేరవేస్తుందన్నారు.