EWS Reservation in TS: తెలంగాణాలో అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు అమలకు ఉత్తర్వులు జారీ .. ఎవరు అర్హులంటే..

|

Feb 08, 2021 | 5:07 PM

లంగాణలో ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే .. రాష్ట్రంలో EWS రిజర్వేషన్లను అమలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు సీఎం చెప్పారు. ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి...

EWS Reservation in TS:  తెలంగాణాలో అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు అమలకు ఉత్తర్వులు జారీ .. ఎవరు అర్హులంటే..
Follow us on

EWS Reservation in TS: తెలంగాణలో ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అగ్రవర్ణాలోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గత నెలలో సీఎం కేసీఆర్ వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణాలో EWS రిజర్వేషన్లను అమలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ రిజర్వేషన్లు 10 శాతం ఉంటాయి. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాలకు ఈ రిజ్వారేషన్లు కల్పిస్తారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఈ EWS రిజర్వేషన్లు అమలవుతాయి.

అయితే తెలంగాణలో ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే .. రాష్ట్రంలో EWS రిజర్వేషన్లను అమలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు సీఎం చెప్పారు. ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇప్పుడు EWS తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఈరోజు ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ జీవో 33ను రిలీజ్ చేసింది. 2019లో జరిపిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ప్రైవేట్ విద్యాసంస్థలు సహా, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రాష్ట్ర ప్రభుత్వ (మైనారిటీ ఎడ్యుకేషనల్ సంస్థలు మినహా)ల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఇక ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలనీ అందుకు సంబంధించిన కొత్తగా రూల్స్, గైడ్ లైన్స్ తయారు చేయమని సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖలకు ఆదేశాలను ఇచ్చింది ప్రభుత్వం.

Also Read:

ఏపీలో రోడ్డెక్కిన వాలంటీర్లు.. జీతాలు పెంచాలంటూ ఆందోళనలు..

కేంద్ర ప్రభుత్వం గతంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ వివరాల ప్రకారం తెలంగాణాలో కూడా ఈ రిజ్వేషన్లకు అర్హులుగా పరిగణింపబడతారు. రూ. 8లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణ పేదలు ఈ కోటా కింద రిజర్వేషన్ పొందేందుకు అర్హులు. అంతేకాదు 5 ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. 1000 చ.అడుగులు లోపే ఇల్లు ఉండాలి. మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ ప్లాట్ 109 చదరపు గజాల లోపు ఉండాలి. అదే పంచాయతీ పరిధిలో అయితే 209 చదరపు గజాల్లోపు ఉండొచ్చు. ఇటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి.  ఇక 2019 ఎన్నికలకు 10శాతం రిజర్వేష్లలు అమలు చేయడానికి ముందు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకుని రాగా ఇప్పుడు తెలంగాణాలో అమలు చేయడానికి కేసీఆర్ ముందుకొచ్చారు. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 6.30 పోలింగ్ షురూ.. సాయంత్రం 4 నుంచి కౌంటింగ్..