‘హస్త’వ్యస్తం..నేడు బీజేపీ పెద్దలతో రాజగోపాల్‌రెడ్డి చర్చలు?

|

Jun 17, 2019 | 1:49 PM

కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి కమలం పార్టీలోకి ఎంట్రీ కోసం లైన్ క్లియర్ చేస్తున్నట్టు సమాచారం. తనతో పాటు మరికొందరు నేతలను కూడా బీజేపీలోకి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఆయన టచ్‌లో ఉన్నారు. దాంతో జగ్గారెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా? అనే చర్చ తెలంగాణలో జోరుగా జరుగుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే పీకల్లోతు […]

హస్తవ్యస్తం..నేడు బీజేపీ పెద్దలతో రాజగోపాల్‌రెడ్డి చర్చలు?
Follow us on

కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి కమలం పార్టీలోకి ఎంట్రీ కోసం లైన్ క్లియర్ చేస్తున్నట్టు సమాచారం. తనతో పాటు మరికొందరు నేతలను కూడా బీజేపీలోకి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఆయన టచ్‌లో ఉన్నారు. దాంతో జగ్గారెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా? అనే చర్చ తెలంగాణలో జోరుగా జరుగుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ మరింత కుదేలు కావడం ఖాయం.

శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కి బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణలో టీడీపీతో పొత్తుపెట్టుకొని కొంప ముంచారన్న కోమటిరెడ్డి… కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్లే రాష్ట్ర నాయకత్వం స్పందించలేదని..ఎన్నికల్లో ఘోర పరాభవం చెందిన ఉత్తమ్‌ రాజీనామా చెయ్యకపోవడాన్ని ఆయన తప్పు బట్టారు.

ఇక సొంత పార్టీపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. ఈ రోజు పార్టీ క్రమశిక్షణా కమిటీ భేటి అయ్యి ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.