బాసర లడ్డు ప్రసాదంలో బొద్దింక

| Edited By:

Jun 23, 2019 | 12:47 PM

బాసర ఆలయం వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదం దేవాలయంలో రాజుకుంటోంది. మొన్నటి దాక అక్రమాలు, అవినీతి లొల్లి నడవగా.. ఇప్పుడు లడ్డూలో పురుగులు బయటపడటంతో మళ్లీ వివాదం నెలకొంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు బాసరకు వస్తుంటారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. పూజల అనంతరం భక్తులు అమ్మవారి ప్రసాదాలు స్వీకరిస్తారు. శనివారం హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కుటంబ సమేతంగా బాసరకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం లడ్డు […]

బాసర లడ్డు ప్రసాదంలో బొద్దింక
Follow us on

బాసర ఆలయం వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదం దేవాలయంలో రాజుకుంటోంది. మొన్నటి దాక అక్రమాలు, అవినీతి లొల్లి నడవగా.. ఇప్పుడు లడ్డూలో పురుగులు బయటపడటంతో మళ్లీ వివాదం నెలకొంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు బాసరకు వస్తుంటారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. పూజల అనంతరం భక్తులు అమ్మవారి ప్రసాదాలు స్వీకరిస్తారు. శనివారం హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కుటంబ సమేతంగా బాసరకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. లడ్డు ఓపెన్ చేసి చూడగా బొద్దింక బయటపడటంతో షాక్‌కు గురయ్యారు.

మరోవైపు ఆలయ అధికారులు మాత్రం అలాంటిదేం లేదంటూ బుకాయిస్తున్నారు. లడ్డూ తయారీలో నాణ్యతను పాటిస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయినప్పటికి ఆలయ అధికారుల్లో మాత్రం మార్పు రావడంలేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

విగ్రహాల గోల్‌మాల్, నిధుల లూటీ ఇలా ఒక్కటేమిటీ.. ఎప్పుడు ఏదో ఒక్క వివాదం. రీసెంట్‌గా రూ.40 లక్షలు కాజేశారంటూ పెద్ద దుమారమే జరిగింది. అవినీతి జలగలు టెంపుల్‌లో తిష్టవేశారంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పురుగులు బయటపడటంతో అధికారుల నిర్లక్ష్యం ఏపాటిగా ఉందో స్పష్టం అవుతోంది.