త్వరలోనే ఫోన్ ట్యాంపింగ్ కేసు ముగుస్తుంది.. సంచలన విషయాలు బయటకొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి

ఫోన్‌ట్యాపింగ్‌ పై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేసినా తనకేం ఇబ్బంది లేదన్నారు. తన ఫోన్‌లో ఏదైనా మీరు వినొచ్చన్నారు. తనకు ఏం తెలిసినా ఇలా మైక్‌లోనే చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు ముగుస్తుందని.. సంచలన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయన్నారు.

త్వరలోనే ఫోన్ ట్యాంపింగ్ కేసు ముగుస్తుంది.. సంచలన విషయాలు బయటకొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy On Phone Tapping Case

Updated on: Nov 13, 2026 | 7:48 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సమ్మిట్‌కు వస్తోన్న విదేశీ ప్రతినిధులను కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. ఆఖరిక్షణంలో వారి వీసాలను రద్దుచేశారంటూ ఆయన మండిపడ్డారు. ఆధార రహితమైన ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ BJP, BRSపై రేవంత్‌ విరుచుకుపడ్డారు.

మోదీ మెప్పుకోసమే రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. కిషన్‌రెడ్డి ఏనాడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయలేదని ఆరోపించారాయన. అసలు ఆయన్ను తెలంగాణ వాసిగా తామెప్పుడూ పరిగణించలేదన్నారు. తెలంగాణ ప్రతిపాదనల మంజూరు కోసం ఆయనెప్పుడూ ప్రయత్నించలేదన్నారు. దేశానికి ఎవరు వచ్చినా గుజరాత్‌కు వెళ్లాలని ఆయన అనుకుంటారని.. ఒక వ్యక్తి తెలంగాణకు ద్రోహం చేసి, గుజరాత్‌ గులామ్‌గా మారితే తమకేం ఇబ్బంది లేదన్నారు.

మేం కష్టపడుతుంటే, చెడగొట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో తెలియట్లేదన్నారు. ఇది పద్ధతికాదని.. ఆయన బీజేపీ కార్యకర్తేం కాదే.. కేంద్రమంత్రన్నారు. ఆయన తన విజ్ఞతను ప్రదర్శించాలని.. విజ్ఞతను ఉపయోగించకుండా కేవలం రాహుల్‌కు వ్యతిరేకంగా మాట్లాడి, మోదీని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us