Telangana: నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

|

May 18, 2022 | 4:32 PM

నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను ఈ ఏడాది కొనసాగించాలని సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా....

Telangana: నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
Kcr
Follow us on

నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను ఈ ఏడాది కొనసాగించాలని సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. దళితబంధు పథకం అమలులో మరింత వేగం పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో(MLA) సీఎం సమీక్ష నిర్వహించారు. జూన్ 2 న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని సూచించారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలుండాలని హితవు పలికారు. ఈ ప్రసంగాలను జిల్లా కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారుచేయాలని, వేసవి ఎండల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గం.లకు ప్రారంభించి, త్వరగా ముగించాలన్నారు. సాయంత్రం పూట జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ రవీంద్రభారతిలో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం సూచించారు. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని అన్నారు. ఎప్పటి మాదిరిగానే హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR) విరుచుకుపడ్డారు. పల్లెలకు కేంద్రం నేరుగా నిధులివ్వడం చిల్లర వ్యవహారమని అన్నారు. స్థానిక పరిస్థితులు రాష్ట్రాలకే తెలుస్తాయి. సీఎం కేసీఆర్ సమీక్షప్రగతి భవన్‌లో పల్లె, పట్టణ ప్రగతి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతోంది. ఢిల్లీ నుంచి కేంద్రమే నిధులు పంచడం సరికాదన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

Viral video: బాబోయ్…ఆ ఇంటి వరండాలో షాకింగ్‌ సీన్‌..సంతానోత్పత్తి కోసం వచ్చిన మూడు జతల పైథాన్‌లు..