చిన్నవయసులో పెద్ద మనసు.. మానవత్వం చాటుకున్న చిన్నారి..

| Edited By: Srikar T

Jun 28, 2024 | 8:02 PM

డెలివరీ అయిన పేదరాలికి ఓ చిన్నారి తన కిడ్డీ బ్యాంక్‌లో జమ చేసుకున్న రూ.4వేల నగదును అందజేసి మానవత్వాన్ని చాటుకుంది. మనూరు మండలం బోరంచ గ్రామానికి చెందిన యువకుడు ప్రశాంత్‌ ఇంట్లో చిన్న కిరాణాకొట్టు నిర్వహించుకొంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.

చిన్నవయసులో పెద్ద మనసు.. మానవత్వం చాటుకున్న చిన్నారి..
Kiddy Bank
Follow us on

డెలివరీ అయిన పేదరాలికి ఓ చిన్నారి తన కిడ్డీ బ్యాంక్‌లో జమ చేసుకున్న రూ.4వేల నగదును అందజేసి మానవత్వాన్ని చాటుకుంది. మనూరు మండలం బోరంచ గ్రామానికి చెందిన యువకుడు ప్రశాంత్‌ ఇంట్లో చిన్న కిరాణాకొట్టు నిర్వహించుకొంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కాగా మే 26వ తేదీన తన కిరాణా కొట్టులోని ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మరణించాడు. ఆ సమయంలో మృతుడి భార్య శ్రీవాణి 6నెలల గర్భవతి.. అతని అంత్యక్రియలకు స్నేహితులు కొంత నగదు సహాయం చేశారు.

కాగా రెండు రోజుల క్రితం శ్రీవాణి ఖేడ్‌లోని ఓ ఆస్పత్రిలో డెలివరీ కావడంతో అమ్మాయికి జన్మనిచ్చింది. ఆస్పత్రి, ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడుతుండడంతో సమీప గ్రామం బెల్లాపూర్‌కు చెందిన 4వ తరగతి చదువుతున్న సాయి సవిర తాను కిడ్డీ బ్యాంక్‌లో జమ చేసుకున్న నగదును అందజేస్తానని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో సంతోషించిన తండ్రి శంకర్‌ తన కూతురు సవిరను ఆస్పత్రికి తీసుకు వచ్చాడు. దీంతో తన కిడ్డీబ్యాంక్‌లో జమ చేసుకున్న రూ.4వేల నగదును అందజేసి మానవత్వాన్ని చాటుకుంది. కార్యక్రమంలో మృతుడి మిత్ర బృందం శంకర్, గణేష్, నరేష్‌ రెడ్డి, దత్తు పాల్గొని చిన్నారిని అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..